
పసిమొగ్గను చిదిమేశారు!
కక్షలకు బాలుడు బలి
వైసీ బండపల్లెలో దారుణం
రేగిపండ్లు కోసిస్తానని తీసుకెళ్లి.. బాలుని చంపి గుహలో పడేసిన వైనం
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
దంపతుల మధ్య ఏర్పడిన చిన్నపాటి విభేదాలు చినికిచినికి గాలివానగా మారి ఓ పసిబిడ్డ నిండు జీవితాన్ని చిదిమేశాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పగ పెంచుకుని.. భర్త తరపు బంధువుల బిడ్డను పొట్టనపెట్టుకున్నారు. ఈ సంఘటన పలమనేరు నియోజకవర్గం వి.కోటలో జరిగింది.
వి.కోట: భార్యభర్తల గొడవ, ఇరువర్గాల వుధ్య వైషవ్యుంగా మారి చివరికి.. ఓ బాలుడి దారుణ హత్యకు దారి తీసింది. వి.కోట మండలం వైసి బండపల్లెకు చెందిన మున్వర్‌కు పలవునేరు వుండలానికి చెందిన షకీరాకు 15 ఏళ్ల క్రితం వివాహం అరుుంది. మున్వర్‌కు ఇది రెండో వివాహం. ఈ నేపథ్యంలో వీరి వుధ్య వునస్పర్థలు రావడంతో గత కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. వుున్వర్‌కు అతని బంధువైన రఫీక్ ఇటీవల వురో వివాహం జరిపించాడు. షకీరా భర్తకు వురోపెళ్లి చేశాడని ఆమె బంధువులు రఫీక్‌పై కక్షపెంచుకున్నారు. ఈ నేపథ్యంలో రఫీక్ కువూరుడైన షేక్‌రిజ్వాన్(10)పై వారి కన్ను పడింది. అదే గ్రావూనికి చెందిన బాబారిజ్వాన్‌తో కలసి బాలుడిని హతవూర్చేందుకు పథకం పన్నారు. గురువారం సాయుంత్రం పాఠశాల పూర్తయిన తర్వాత ఆడుకుంటున్న బాలుడిని సమీప అడవిలో రేగిపళ్లు కోసిస్తానని చెప్పి బాబా రిజ్వాన్ పిలుచుకునిపోయూడు. అయితే బాలుడు రాత్రైనా ఇంటికి చేరుకోకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని బాబా రిజ్వాన్ రేగిపళ్ల కోసం తీసుకెళ్తుండడం చూసిన వ్యక్తులు బంధువులకు సవూచారవుందించారు. గ్రావుస్తులు బాబా రిజ్వాన్‌ను ప్రశ్నించగా తనకు తెలియుదని బుకారుుంచాడు.
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయుడంతో తానే బాలుడిని గ్రావు సమీపంలోని దాబాల గుట్ట వద్ద తీసుకెళ్లి తీగలతో గొంతుకు ఉరివేసి హతవూర్చినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు, స్థానికులు కలసి దాబాల గుట్ట వద్దకు చేరుకున్నారు. అతి కష్టం మీద బాలుడి వుృతదేహన్ని గుర్తించి వెలికి తీశారు. సంఘటనా స్థలానికి కుప్పం సీఐ రాజశేఖర్ చేరుకుని వివరాలు ఆరా తీశారు. నిందితుడైన బాబా రిజ్వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరుుతే నిందితుడు బాబా రిజ్వాన్ బాలుడి హత్యకు దారితీసిన కారణాలను ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా చెబుతుండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తనతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా హత్యకు సహకరించినట్లు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే తాను ఆర్థికంగా స్థితివుంతుడు కాకపోవడం వల్లే తనకు పెళ్లి కాలేదని, అందుకే షేక్‌రిజ్వాన్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించాలని భావించినట్టు బాబా రిజ్వాన్ కొందరు గ్రామస్తులకు చెప్పినట్లు సమాచారం. హత్యకు గురైన బాలుడు షేక్‌రిజ్వాన్ స్థానిక పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. కారణం ఏదేమైనప్పటికీ సంచలనం రేపిన బాలుడి హత్య కేసు వివరాలు పోలీసుల విచారణలో నిగ్గు తేలాల్సి ఉంది.