గోడ కూలి వ్యక్తి దుర్మరణం | man killed wall | Sakshi
Sakshi News home page

గోడ కూలి వ్యక్తి దుర్మరణం

Published Thu, Sep 8 2016 1:06 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

గోడ కూలి వ్యక్తి దుర్మరణం - Sakshi

గోడ కూలి వ్యక్తి దుర్మరణం

మరో ఇద్దరికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలు
పాత ఇల్లు కూల్చుతుండగా సంఘటన
పెదపూడి : పాత ఇల్లు కుల్చుతుండగా.. గోడ కూలి ఒక వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరి కి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలయ్యా యి. వివరాల్లోకి వెళితే.. జి.మామిడాడకు చెందిన దొరబాబు అనే వ్యక్తి శహపురం శివారు లంకలో వి.నాగమణికి చెందిన పాతఇంటి సా మగ్రి, మట్టిని తరలించడానికి బేరం కుదుర్చుకున్నాడు. ఆ ఇంటిని కూల్చి, మట్టిని ట్రాక్టర్లపై తరలించడానికి జి.మామిడాడ శివారు పాటిమీ ద గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు మూ డు రోజులుగా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం ఇంటి గోడ కూలి ముగ్గురు కూలీలపై పడింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే మో కాన శివనారాయణ(38) చనిపోయాడు. కూలీ లు పి.ధర్మయ్య, ఎం.రాజుకు తీవ్ర గాయాలు కాగా, వారిని 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రి కి తరలించారు. స్వల్పంగా గాయపడిన ఐ.కోదండం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీఆర్‌ఓ సోమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై పెదపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, ఎస్సై వీఎల్‌వీకే సుమంత్‌ సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement