గోడకూలి వృద్ధుడి మృతి | a wall fell down oldman | Sakshi
Sakshi News home page

గోడకూలి వృద్ధుడి మృతి

Published Thu, Jul 28 2016 12:11 AM | Last Updated on Sat, Jul 6 2019 12:36 PM

గోడకూలి వృద్ధుడి మృతి - Sakshi

గోడకూలి వృద్ధుడి మృతి

కట్టంగూర్‌
 గోడకూలి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ముత్యాలమ్మగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల లింగయ్య(70) తన ఇంటి ఆవరణలో ప్రహరీ పక్కనే మంచం వేసుకుని పడుకున్నాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ నానడంతో ఒక్కసారిగా కుప్పకూలి లింగయ్యపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ ప్రమీల, ఆర్‌ఐ జానీ షరీఫ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement