తప్పిన ప్రమాదం
తప్పిన ప్రమాదం
Published Tue, Jul 26 2016 11:27 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
విజయవాడ (భవానీపురం) :
కొండప్రాంతంలో రిటైనింగ్‌వాల్ కూలి దిగువన ఉన్న ఇంటిపై పడడంతో ఇల్లు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ధ్వంసమైన ఇంటిలోని ఒక పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న కొత్త జంట తృటిలో ప్రమాదం నుంచి తప్పుకున్నారు. 33వ డివిజన్ పరిధిలోని రామరాజ్యనగర్ కొండపై వాటర్ ట్యాంక్ వద్ద కార్పెంటర్ చలపాక త్రినాథాచారి నివసిస్తున్నారు. దిగువున టైలరింగ్ వృత్తి చేసుకునే గట్ల జనార్దన్, పద్మ దంపతుల రేకుల షెడ్ ఇల్లు ఉంది. దానిలో మూడు పోర్షన్లు ఉండగా ఒక దానిలో జనార్దన్, మరో పోర్షన్‌లో ఇటీవలే వివాహమైన ఆయన కుమారుడు నాగు, వనిత దంపతులు ఉంటున్నారు. మరో పోర్షన్‌లో వేరేవారు ఉంటున్నారు. మంగళవారం ఉదయం సుమారు 10.30 గంటలకు త్రినాథాచారి ఇంటిపక్కనే ఉన్న రిటైనింగ్‌వాల్ ఒక్కసారిగా కూలి దిగువున ఉన్న జనార్దన్ ఇంటిపై పడింది. దీంతో పైరేకులు పగిలిపోయి ఇంటిలోని వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఒక పోర్షన్‌లో ఉండేవారు తాళంవేసి ఊరు వెళ్లగా జనార్దన్, పద్మలు తాము పనిచేసే టైలరింగ్ షాపునకు వెళ్లారు. రిటైనింగ్‌వాల్ కూలిపోవడానికి అరగంట ముందే కొత్త జంట నాగు, వనితలు బయటకు వెళ్లారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక కార్పొరేటర్ హరనాథస్వామి, బీజేపీ యువ మోర్చా నగర ప్రధాన కార్యదర్శి బొండా నిరీష్‌కుమార్, పశ్చిమ కో–కన్వీనర్ మైలవరపు దుర్గారావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వీఆర్వో మల్లికార్జునరావు వివరాలను సేకరించారు. రిటైనింగ్‌వాల్ కూలిన త్రినాథాచారి ఇంటి పక్కన ఇళ్లల్లో
Advertisement