మూర్ఖంగా చేయకండి.. అభిమానికి హీరో ట్విట్‌ ! | tiger shroff fan jumping of ai 13 feet wall in mumbai | Sakshi
Sakshi News home page

మూర్ఖంగా చేయకండి.. అభిమానికి హీరో ట్విట్‌ !

Published Tue, Nov 28 2017 4:00 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

tiger shroff fan jumping of ai 13 feet wall in mumbai - Sakshi

ముంబై: హీరోలు సినిమాలో చేసే స్టంట్స్‌ అభిమానులపై ప్రభావం చూపుతాయి. బాహుబలి-2 సినిమాలో  ప్రభాస్‌ ఏనుగు తొండంపై పైకి ఎక్కుతాడు. ఆ విధంగా చేయాలని కేరళకు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఏమైందో ఏమో గజరాజుకి  కోపం వచ్చి తొండంతో ఆ వ్యక్తిని దూరంగా విసిరేసింది. తీవ్రగాయాలై ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అదే విధంగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి సాహసామే చేశాడు. బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌కి అమన్ అనే వ్యక్తి అభిమాని. తన సినిమాల్లో టైగర్‌ డూప్‌ లేకుండా స్టంట్లను చాలా ఈజీగా చేస్తుంటారు.

2016లో వచ్చిన ‘ప్లయింగ్‌ జాట్‌’ సినిమాలో టైగర్‌ చాలా స్టంట్లు చేశారు. అమన్ తన హీరో చేసిన స్టంట్‌నే ప్రయత్నించాడు. దాదాపుగా 13 అడుగుల గోడపై నుంచి దూకేశాడు. అతను దూకుతున్నప్పుడు తీసని వీడియోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘ నేను భయాన్ని జయించాను. అంత పై నుంచి దూకడం అంత ఈజీ కాదు అందుకు చాలా ధైర్యం కావాలి. కింది నుంచి చూస్తే ఏలాంటి భయం ఉండదు.. కానీ గోడపైకి ఎక్కితే భయం అనేది తెలుస్తుంది. నాకు నేనే హీరోగా ఫీలై అలా కిందకు దూకాను. నాకు ఈ స్పూర్తిగా నిలిచిన టైగర్‌ ష్రాఫ్కు కృతజ్ఞతలు’ అని అమన్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ట్విట్‌ చేశాడు.

ఈ వీడియో చూసిన హీరో టైగర్‌ తన ట్విట్టర్‌ ద్వారా స్పందించి..‘ నువ్వు ఈ విధంగా చేయడం చాలా మూర్ఖత్వం. నీ లైఫ్‌ను ఈ విధంగా ఎప్పుడు రిస్క్‌ చేయవద్దు. చిత్ర షూటింగ్‌ సమయంలో ఈ విధమైన స్టంట్లు చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తారు. ఈ విధమైన విన్యాసాలను స్వతహగా చేయకండి’ అని టైగర్‌ అమన్‌ను ఉద్దేశించి ట్విట్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement