ఆ హీరోతో డేటింగ్ చేయలేదు.. చేయను! | i dont want dating with actors, says niddhi agerwal | Sakshi
Sakshi News home page

ఆ హీరోతో డేటింగ్ చేయలేదు.. చేయను!

Published Thu, Oct 6 2016 6:48 PM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

ఆ హీరోతో డేటింగ్ చేయలేదు.. చేయను! - Sakshi

ఆ హీరోతో డేటింగ్ చేయలేదు.. చేయను!

బాలీవుడ్ లో ఏదైనా కొత్త మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటే చాలు ఆ సినిమా హీరో, హీరోయిన్లపై పుకార్లు ప్రచారంలోకి వస్తాయి. సరిగ్గా ఇలాంటి విషయమే బాలీవుడ్ కు పరిచయం అవుతున్న హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఎదురైంది. ఈ విషయంపై నిధి చాలా ఘాటుగానే స్పందించింది. సినిమాకు అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు హీరోతో డేటింగ్ చేస్తానని తాను ఎక్కడా చెప్పలేదు అంటోంది. అన్ని క్లాజ్ లు చదివిన తర్వాతే మూవీకి ఓకే చెప్పానని స్పష్టం చేసింది.

హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని, సినిమా పబ్లిసిటీ కోసం రొమాన్స్ అంటూ అలాంటి విషయాలలో తలదూర్చడం తనకు ఇష్టం ఉందని చెప్పింది. షబ్బీర్ ఖాన్ తెరకెక్కించనున్న 'మున్నా మైఖెల్'లో టైగర్ ష్రాఫ్ తో ఈ భామ జోడీకట్టనుంది. మరో రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సినిమా అంటే హీరోతో ఎక్కడ పడితే అక్కడ తిరగాలా, పబ్లిసిటీ కోసం డేటింగ్ చేయడం లాంటివి తనకు నచ్చవని.. మూవీ కోసం నటనలో నూటికి నూరుపాళ్లు శ్రమిస్తానని బాలీవుడ్ భామ పేర్కొంది. గతంలో జాకీ ష్రాఫ్ తో నటించిన హీరోయిన్లు అందరితో అతడు డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో నిధి కూడా అదేబాట పట్టనుందా అన్న అనుమానాలను పటాపంచలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement