రోడ్డున పడ్డ యంగ్ హీరోయిన్! | Actress Nidhhi Agerwal Was Asked To leave Her Rented Apartment | Sakshi
Sakshi News home page

రోడ్డున పడ్డ యంగ్ హీరోయిన్!

Published Tue, May 16 2017 11:12 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

రోడ్డున పడ్డ యంగ్ హీరోయిన్! - Sakshi

రోడ్డున పడ్డ యంగ్ హీరోయిన్!

ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రోడ్డున పడ్డారు. మున్నా మైఖేల్ మూవీలో టైగర్ సరసన నటించిన నిధి అగర్వాల్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. సినీ ప్రపంచంలో వెలుగు వెలగాలని కర్ణాటక నుంచి ముంబైకి వచ్చిన నిధి ఆమె రోడ్డున పడటం సంగటి ఏంటంటారా.. గతేడాది నుంచి ముంబైలోని బాంద్రాలో ఓ అపార్ట్‌మెంట్‌లో స్నేహితురాలితో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవల హైసింగ్ సొసైటీ వారు ఆమెకు ఓ షాకిచ్చారట. సాధ్యమైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నది వారి డిమాండ్. 'ఆరు నెలలుగా స్నేహితురాలితో కలిసి ఇక్కడ ఉంటున్నాను. అయితే ఒంటరిగా ఉన్న నటిపై, మోడల్‌పై వీరిది చాలా చిన్న చూపు. నేను సింగిల్‌గా ఉన్నందున ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నానేమోనని సొసైటీ భావిస్తోంది.

నాకే కాదు ఇలా ఎవరు వచ్చిన మహిళలు మొదట్లో ఇల్లు కోసం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సినిమా వాళ్లు షూటింగ్స్ వల్ల ఏ సమయానికి ఇంటికి చేరుతామో తెలియదు. దాంతో పొరుగువారికి ఇది నచ్చడం లేక ఫిర్యాదు చేశారు. వారి అనుమానాలను మరికొందరు సమర్థించడంతో నాలాంటి ఒంటరి ఆడపిల్లలకు కష్టాలు మొదలయ్యాయి. ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నారు. నువ్వు సింగిల్ ఆ.. సినిమాలో నటిస్తున్నావా అంటూ నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో నా పరిస్థితి రోడ్డున పడ్డట్లు తయారైంది' అని బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ వాపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షబానా అజ్మీ, ఇమ్రాన్ హష్మీ, తదితరులు కూడా ఇలాంటి కష్టాలు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement