గోడ కూలి బాలుడి మృతి
విజయనగరం: శృంగవరపుకోట మండలంలోని వెంకటరమణపేట గ్రామంలో గోడకూలి వెంకటేశ్(11) అనే బాలుడు శనివారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. వివరాలు...వెంకటేశ్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గోడకింద పడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గోత పాతది కావడంతో కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గోడపక్కనే బాలుడు సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా కూలిడంతో ఊపిరాడక మృతిచెందాడు. కొడుకు చనిపోవడంతో తల్లి సత్యవతి కన్నీరుమున్నీరవుతోంది.
(శృంగవరపుకోట)