రణస్థలం : శ్రీకాకుళం జిల్లా లో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన పాత గోడ కూలి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం జిల్లా రణస్థలం మండలం జె.ఆర్. పురం కాలనీలో జరిగింది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.