సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని సంగీత్ థియేటర్ సమీపంలో గోడ కూలిన సంఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు. తొలుత ఒకరు చనిపోయినట్టుగా వార్తలు రాగా, ఆ తర్వాత మృతుల సంఖ్య రెండుకు పెరిగింది. మల్టీప్లెక్స్ నిర్మాణ దశలో గోడ కుప్పకూలింది. రక్షణ చర్యలు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణనష్టం జరిగినట్టు భావిస్తున్నారు. చనిపోయిన వారిని రాజయ్య, శారదలుగా గుర్తించారు.
ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు శిథిలాల కింద ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. నిర్మాణపనులకు సంబంధించి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.