
( ఫైల్ ఫోటో )
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇంట్లో ఓ యువకుడు గోడదూకి గాయాలపాలయ్యాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్‌నెం 81లో నివసించే మహేష్‌బాబు ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి కృష్ణ(30) అనే యువకుడు గోడ దూకి ఇంట్లోకి చొచ్చుకెళ్ళేందుకు యత్నించాడు. పది అడుగుల ఎత్తున్న గోడ మీది నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
శబ్ధానికి అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా తీవ్ర గాయాలతో వ్యక్తి కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆరా తీయగా సదరు యువకుడు మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వచ్చి సమీపంలోని ఓ నర్సరీలో పని చేస్తున్నట్లుగా తేలింది. నిందితుడు కోలుకున్నాక లోతుగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.
చదవండి: (25 ఏళ్లకే గుండె సమస్యలు..గోల్డెన్ అవర్‌లో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు)
Comments
Please login to add a commentAdd a comment