
ఎప్పుడు? ఆదివారం ఉదయం! ఎక్కడ? హైదరాబాద్‌లోనే! రైడింగ్‌కి వెళ్లిందెవరు? చేసామ్! కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు ముద్దుగా ‘చే’ అని అక్కినేని నాగచైతన్యను, అతని అర్ధాంగి సమంతను ‘సామ్’ అని పిలిచే విషయం తెలిసిందే. ఇంతకీ ఫొటోలో చక్కగా స్టైలుగా హెల్మెట్ పెట్టుకుని నిలబడిందెవరో తెలుసా? సమంతే! యాక్చువల్లీ... ఇద్దరూ బైక్‌పై రైడ్‌కి వెళ్లారు. మధ్యలో ఓ చోట (రెస్టారెంట్‌లో) బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అక్కడ ఓ చిన్న కారు కనబడితే ఫొటో దిగి... ‘‘నా అంత చిన్నగా ఉన్నవాటిని కనిపెట్టినప్పుడు భలే సంతోషంగా ఉంటుంది’’ అని సమంత పేర్కొన్నారు.
మరి, చైతన్య ఎటువంటి డ్రస్సులో వెళ్లారు? అంటే... రైడర్స్ జాకెట్, హెల్మెట్, హ్యాండ్ గ్లోవ్స్ వంటి జాగ్రత్తలతో వెళ్లారు. బైక్స్ అండ్ కార్స్ అంటే ఎంతో ఇష్టమని చైతన్య పలు సందర్భాల్లో వెల్లడించారు. పెళ్లికి ముందు సమంతను ఓసారి రేస్ ట్రాక్‌పై కారులో రైడ్‌కి తీసుకెళ్లారు. ఇప్పుడు బైక్ రైడ్‌కి వెళ్లారు. ఇక్కడ ప్రేక్షకులకు ఓ సందేశం కూడా ఇచ్చారండోయ్... ‘బైకులపై వెళ్లేటప్పుడు హెల్మెట్స్ ధరించండి’ అని! అందరూ ఈ రూల్ ఫాలో అయితే బాగుంటుంది కదూ!!
Comments
Please login to add a commentAdd a comment