ఉమ్లిగ్ లా పాస్ బైక్‌పై వెళ్లిన మల్కాజిగిరివాసి
8,800 కిలోమీటర్ల సాహసయాత్ర
సాక్షి,హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మోటారబుల్ పాస్ వద్దకు ఒంటరిగా బైక్‌పై వెళ్లి రికార్డు సృష్టించాడు మల్కాజిగిరికి చెందిన యువకుడు. దేశంలోని చివరి గ్రామమైన టర్దుక్, పాకిస్తాన్ సరిహద్దు తంగ్ గ్రామం, సియాచిన్ బేస్ క్యాంప్, భూమిపై ఎత్తైన యుద్ధభూమిని సందర్శించి ఔరా అనిపిస్తున్నాడు. మల్కాజిగిరికి చెందిన బత్తిని సాయివంశీ గౌడ్ 26 రోజుల పాటు 8,800 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి రికార్డులు తిరగరాస్తున్నాడు. ఈ నెల 2న ప్రారంభించిన తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు.
19,024 అడుగుల ఎత్తులో..
లఢాక్‌లో 19,024 అడుగుల ఎత్తులోని ఉమ్లింగ్ లా పాస్ 11 రోజుల్లో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఎన్నో అడ్డంకులను దాటుకుని, మొక్కవోని దీక్షతో ఉమ్లింగ్‌లా పాస్ చేరుకుని తెలంగాణ కెరటాన్ని ఎగురవేశాడు.
అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆర్మీ అధికారులు ఎంతో సహాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment