
జోరుగా జాతీయ రైడ్
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: ఇండియన్ మోటార్ సైకిల్ రైడర్స్ గ్రూప్ తొలి జాతీయ రైడ్‌కు అద్భుత స్పందన లభించిందని నిర్వాహక సంస్థ పొలారిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు. నగరంతో పాటు పలు ప్రాంతాల నుంచి ఈ రైడ్‌లో పాల్గొనేందుకు బైక్ లవర్స్ ఆసక్తి చూపారని, వీరిలో ఎంపిక చేసిన బైకర్లు ముంబై నుంచి దమన్ (గుజరాత్) వరకు రైడ్ కొనసాగించారని చెప్పారు. గత నెల 30న ప్రారంభమైన రైడ్ ఈ నెల 2 వరకు సాగింది.