
ఎన్ని రోజులు ఇలా! ఒకేలా! ఎప్పడూ అలాగే ఉంటే.. లైఫ్ అనే రెయిన్‌బోకు రంగులు దిద్దేది ఎప్పుడు? అనుకున్నారు అమలాపాల్. అనుకున్న వెంటనే కాళ్లు, కళ్లు, కలలు గడప దాటాయి. డైరెక్ట్‌గా హిమాలయాల్లో తేలాయి. అక్కడికి వెళ్లిన అమలాపాల్... ఏ దిక్కులో ఏమున్నదో వెంటాడి జ్ఞాపకాలను పోగు చేసుకుందామనుకున్నారు. కాలినడన వెళితే టైమ్ వేస్ట్. పోనీ బస్సులో వెళితే ఎన్ని స్టాప్‌లో.
అందుకే లాభం లేదని బుల్లెట్ బైక్ ఎక్కేశారు. సరౌండింగ్స్‌లో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్‌ని రౌండప్ చేస్తున్నారు. ఇన్‌సెట్‌లో ఉన్న అమలాపాల్ ఫొటోలు చూస్తుంటే ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారో అర్థం అవుతోంది కదా. ‘‘మన ఆలోచనలకు రెక్కలు రావడం కాదు ఫ్రీడమ్ అంటే. అది పర్సన్‌కు ఎటాచ్ అయి ఉండదు. భరించలేనంత ఆనందంగా ఉండటమే ఫ్రీడమ్ అంటే. ఆ ఆనందం నీ మనసుకు తెలియాలి’’ అని చెబుతున్నారామె.
Comments
Please login to add a commentAdd a comment