రొమాంటిక్‌గా నటించి ఏడ్చేసింది! | Hansika-Arya intimate song in 'Meegaamann' shot aesthetically | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌గా నటించి ఏడ్చేసింది!

Published Tue, Aug 19 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

రొమాంటిక్‌గా నటించి ఏడ్చేసింది!

రొమాంటిక్‌గా నటించి ఏడ్చేసింది!

కథ డిమాండ్ చేసిన మేరకు ఒక్కోసారి కథానాయికలు హద్దులు దాటి అంగాంగ ప్రదర్శన చేయాల్సి వస్తుంది. కొంతమంది మాత్రం అలాంటివి చేయమని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. కానీ, ఆ సన్నివేశం ప్రాధాన్యతను దర్శకుడు వివరిస్తే.. అర్ధమనసుతో అంగీకరించేస్తారు. ఇటీవల హన్సిక అలానే చేశారు. ఆర్య సరసన ఆమె ‘మీగామన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఆర్య, హన్సిక పాల్గొనగా ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. ఈ పాట కోసం హన్సికకు చాలా కురచ దుస్తులు డిజైన్ చేయించారట.
 
  ఇప్పటివరకూ ఏ చిత్రం కోసమూ హన్సిక అలాంటి దుస్తులు ధరించలేదని సమాచారం. అది మాత్రమే కాదు... ఆర్యతో చాలా రొమాంటిక్‌గా నటించాల్సి వచ్చిందట. ముందు దీనికి ససేమిరా అన్నప్పటికీ, ఆ తర్వాత ఆ పాటకు ఉన్న ప్రాధాన్యతను దర్శకుడు వివరించడంతో హన్సిక ఒప్పుకున్నారు. కానీ, పాట చిత్రీకరణ పూర్తి కాగానే.. ఒక్కసారిగా ఏడ్చేశారట. ‘హన్సిక ఇలా నటించిందేమిటి? అని అభిమానులు తప్పుగా అనుకుంటారేమో’ అని వాపోయిందట. కానీ, అలాంటిదేం జరగదని దర్శకుడు హామీ ఇచ్చినా, అర్ధమనసుతో తలూపారట హన్సిక.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement