magizh thirumeni
-
లైకాపై అజిత్ ఫ్యాన్స్ ఆగ్రహం
-
రొమాంటిక్గా నటించి ఏడ్చేసింది!
కథ డిమాండ్ చేసిన మేరకు ఒక్కోసారి కథానాయికలు హద్దులు దాటి అంగాంగ ప్రదర్శన చేయాల్సి వస్తుంది. కొంతమంది మాత్రం అలాంటివి చేయమని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. కానీ, ఆ సన్నివేశం ప్రాధాన్యతను దర్శకుడు వివరిస్తే.. అర్ధమనసుతో అంగీకరించేస్తారు. ఇటీవల హన్సిక అలానే చేశారు. ఆర్య సరసన ఆమె ‘మీగామన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఆర్య, హన్సిక పాల్గొనగా ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. ఈ పాట కోసం హన్సికకు చాలా కురచ దుస్తులు డిజైన్ చేయించారట. ఇప్పటివరకూ ఏ చిత్రం కోసమూ హన్సిక అలాంటి దుస్తులు ధరించలేదని సమాచారం. అది మాత్రమే కాదు... ఆర్యతో చాలా రొమాంటిక్గా నటించాల్సి వచ్చిందట. ముందు దీనికి ససేమిరా అన్నప్పటికీ, ఆ తర్వాత ఆ పాటకు ఉన్న ప్రాధాన్యతను దర్శకుడు వివరించడంతో హన్సిక ఒప్పుకున్నారు. కానీ, పాట చిత్రీకరణ పూర్తి కాగానే.. ఒక్కసారిగా ఏడ్చేశారట. ‘హన్సిక ఇలా నటించిందేమిటి? అని అభిమానులు తప్పుగా అనుకుంటారేమో’ అని వాపోయిందట. కానీ, అలాంటిదేం జరగదని దర్శకుడు హామీ ఇచ్చినా, అర్ధమనసుతో తలూపారట హన్సిక. -
'ఆర్య చాలా తెలివైన నటుడు'
డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన నటుడు.. ఆర్య. తమిళంలో మంచి జోరుమీదున్న ఆర్య.. చాలా తెలివైన నటుడని దర్శకుడు మగిళ్ తిరుమేని ప్రశంసలు కురిపించాడు. ఆర్యతో కలిసి 'మేగామన్' అనే సినిమా తీస్తున్న తిరుమేని.. తన హీరో ఆర్య సహజంగానే తెలివైనవాడని, కథకు తన అవసరం ఏంటో సులభంగా అర్థం చేసుకుని, అంచనాలకు మించిన పెర్ఫార్మెన్స్ అందిస్తాడని చెప్పాడు. పరిశ్రమలో ఉన్న చాలా తక్కువమంది తెలివైన నటుల్లో ఆర్య ఒకడని, అతడితో సినిమా తీయడం చాలా సులువని అన్నాడు. 'మేగామన్' సినిమాలో ఆర్య నటన చూసి తాను స్టన్నయ్యానని, ఇప్పటివరకు అతడి కెరీర్లో ఇలాంటి నటన ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. ఆర్యకు నిజాయితీ కూడా చాలా ఎక్కువని, పని పట్ల అతడికి అనురక్తి బాగా ఉందని అన్నాడు. ఈ సినిమాలో హన్సిక సరసన నటించే ఆర్య చాలా సహజంగా, స్టైలిష్గా కనిపిస్తాడని చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.