![nehru offered indian citizenship to j robert oppenheimer - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/25/nehru.gif.webp?itok=2glzyGmF)
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ‘ఓపెన్‌హైమర్’ సినిమా విడుదల అయిన నేపధ్యంలో అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ జీవితం గురించి తెలుసుకోవానే ఆసక్తి పలువురిలో నెలకొంది. ఇటీవలే విడుదలైన ఒక పుస్తకంలో ప్రముఖ శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్‌హైమర్‌కు భారత్‌తో ముడిపడి ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. భారత దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్‌హైమర్‌కు భారత పౌరసత్వం ఆఫర్ చేశారనే విషయం ఆ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ భారతీయ పార్సీ రచయిత భక్తియార్ కే దాబాభాయి భారత శాస్త్రవేత్త హోమీ భాభా జీవితం ఆధారంగా రచించారు.
రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక..
ఈ పుస్తకంలో అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్- హోమీ బాబాల స్నేహానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. ‘హోమీ జే భాభా: ఏ లైఫ్’ పేరుతో భక్తియార్ కే దాదాభాయి రాసిన ఈ పుస్తకంలో ‘రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌ను భాభా కలుసుకున్నారు. అనంతరం వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. భాభా మాదరిగానే రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ కూడా గౌరవమర్యాదలతో మెలిగిన వ్యక్తి. రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ సంస్కృత భాషను కూడా నేర్చుకున్నారు. దీనితో పాటు ఆయనకు లాటిన్, గ్రీకు భాషలు కూడా వచ్చు’ అని పేర్కొన్నారు.
బాంబు తయారీ వరకే తన బాధ్యత..
బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ తయారు చేసిన అణుబాంబును రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హీరోషిమా, నాగసాకిలో ప్రయోగించారు. అయితే అంతటి శక్తిమంతమైన బాంబు తయారు చేయడం తగినది కాదని రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌పై విమర్శలు వచ్చాయి. దీనికి ఆయన సమాధానమిస్తూ బాంబు తయారు చేయడం వరకే తన బాధ్యత అని, దానిని ఎలా వినియోగించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడంతో తనకు సంబంధం లేదన్నారు.
తాను అమెరికా విడిచిపెట్టబోనంటూ..
అయితే ఆ తరువాత రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ తన వైఖరిని మార్చుకున్నారు. దీనికిమించిన శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు తయారీని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో అతనికి అమెరికా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అప్పటివరకూ అతని ఇచ్చిన రక్షణ వ్యవస్థను కూడా తొలగించారు. ఆ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం సరిగ్గా అదే సమయంలో నాటి భారత ప్రధాని నెహ్రూ.. శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌కు భారత పౌరసత్వం ఇవ్వజూపారు. అయితే ఆయన దీనిని తిరస్కరించారు. అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలన్నింటి నుంచి విముక్తి కలిగేవరకూ తాను అమెరికా విడిచిపెట్టబోనని ఓపెన్‌హైమర్ స్వయంగా నెహ్రూకు తెలియజేశారట. రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ అమెరికా దేశభక్తుడైనందున కూడా ఈ ఆఫర్ తిరస్కరించారని కూడా నిపుణులు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి..
Comments
Please login to add a commentAdd a comment