Citizen
-
చెన్నమనేని జర్మనీ పౌరుడే
సాక్షి, హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చె న్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని మండిపడింది.ఇందుకుగాను ఆయనకు హైకోర్టు చరిత్రలోనే తొలి సారిగా ఏకంగా రూ. 30 లక్షల భారీ జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్ (ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి)కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని రమేశ్‌ను ఆదేశించింది. చెల్లింపునకు నెల రోజులు గడువు విధించింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎ మ్మెల్యేగా విజయం సాధించింది మొదలు చెన్నమ నేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొన సాగుతోంది.ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దీనిపై తొలి నుంచీ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీ పౌరసత్వం కారణంగా రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019 నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అదే సంవత్సరం ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి అక్టోబర్‌లో తీర్పు రిజర్వు చేసి సోమవారం తీర్పు వెలువరించారు. ఆయన ఎన్నిక కూడా చెల్లదన్న ఆది శ్రీనివాస్ చెన్నమనేని ఇరుదేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదించారు. ‘రెండుచోట్ల వివిధ కేటగిరీల కింద పౌరసత్వం కలిగి ఉండటాన్ని మన చట్టాలు అనుమతించవు. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుడు ఎన్నటికీ ఇక్కడ ఎమ్మెల్యే కాలేరు. తన పౌరసత్వ సమస్య 2009 నుంచి పెండింగ్‌లో ఉన్నా చెన్నమనేని రమేశ్ రెండు పౌరసత్వాలలో ఒకదాన్ని వదులుకోలేదు’అని వారు గుర్తుచేశారు.చెన్నమనేని రమేశ్ క్లెయిమ్ చేస్తున్న రెండు విభిన్న రకాల పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను న్యాయమూర్తికి సమరి్పంచారు. రమేశ్ పౌరసత్వాన్ని కొనసాగించడం ‘ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు’అని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. మరోవైపు ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు వాదిస్తూ ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుతో చెన్నమనేని రమేశ్ జర్మనీకి అనేకసార్లు వెళ్లారు. జర్మనీ పౌరసత్వంతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నిక కూడా చెల్లదు’అని పేర్కొన్నారు. ఆ అధికారం కేంద్రానికి లేదని వాదించిన రమేశ్ మరోవైపు చెన్నమనేని రమేశ్ తరఫున న్యాయవాది రామారావు వాదిస్తూ ‘చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారు. జర్మనీ పాస్పోర్టుతో ప్రయాణించినంత మాత్రాన ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు కాదు. దేశ సార్వ¿ౌమత్వానికి విఘాతం కలిగించిన వారి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. కానీ రమేశ్ అలాంటి చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవాలి. చెన్నమనేని రమేశ్ పౌరసత్వ రద్దు నోటిఫికేషన్‌ను కొట్టేయాలి’అని కోరారు.అప్పీల్‌కు వెళ్లడాన్ని పరిశీలిస్తా: చెన్నమనేనిహైకోర్టు తీర్పు తీవ్ర నిరాశపరిచిందని చెన్నమనే ని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సో మవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రా జకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు నడిచానని.. నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తుచేశారు. వరుస ఓటములను జీర్ణించుకోలేక రాజకీయ ప్రత్యర్థులు తన పౌరసత్వంపై కేసులు వేశారని చెన్నమనేని ఆరోపించారు. ఇలాంటి కేసులను గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టులో విజయవంతంగా ఎదుర్కొన్నానని.. తాజా తీర్పుపై అప్పీల్ చేసే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వేములవాడ అభివృద్ధికి సహకరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు -
కొత్తగా 59 వేల భారతీయులకు అమెరికా పౌరసత్వం
గడచిన ఏడాది అంటే 2023లో 59 వేలమంది భారతీయులకు అమెరికా పౌరసత్వం దక్కింది. తాజాగా ‘అమెరికా పౌరసత్వం- 2023’ నివేదిక విడుదలయ్యింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2023లో అమెరికా 59,000 మందికి పైగా భారతీయులకు పౌరసత్వం ఇచ్చింది. అమెరికా పౌరసత్వం పొందడంలో భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు. మెక్సికో మొదటి స్థానంలో ఉంది. అధికారిక నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో (సెప్టెంబర్ 30, 2023తో ముగిసే సంవత్సరం) సుమారు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు యూఎస్ పౌరులుగా మారారు. వీరిలో 1.1 లక్షలకు మించిన మెక్సికన్లు, 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. యూఎస్ పౌరసత్వం మంజూరుకు దరఖాస్తుదారు తప్పనిసరిగా వలస, జాతీయత చట్టం (ఐఎన్ఏ)లో నిర్దేశించిన నిర్దిష్ట అర్హతలకు అనుగుణంగా ఉండాలి. కనీసం 5 సంవత్సరాలు చట్టబద్ధమైన శాశ్వత నివాసి (ఎల్పీఆర్)గా ఉండాలి. అలాగే అమెరికా పౌరులను జీవిత భాగస్వామిగా కలిగివుండడం, లేదా మిలటరీ సేవలో ఉండడంతో పాటు పలు సాధారణ నిబంధనలు పౌరసత్వాన్ని పొందేందుకు అర్హతలుగా ఆ నివేదిక పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2023లో అమెరికా పౌరసత్వం అందుకున్నవారిలో చాలా మంది ఐదేళ్ల చట్టబద్ద నివాసం ద్వారా అర్హత పొందినవారేనని నివేదిక వెల్లడించింది. అయితే అమెరికన్ పౌరులను పెళ్లి చేసుకున్నవారికి మూడేళ్ల వ్యవధికే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. -
ఇంటిపై కన్నేసి.. ఎన్నారైని చంపేసి!
హైదరాబాద్: నగరంలో ఉన్న స్థిరాస్తుల క్రయవిక్రయం పేరుతో ఓ ఎన్నారైకి చేరువయ్యాడు. ఆయన ఇంటిపై కన్నేసి సొంతం చేసుకోవాలనుకున్నాడు.. దాన్ని ఖరీదు చేసేందుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నాడు.. తన పథకాన్ని అమలు చేస్తూ అతడిని దారుణంగా చంపేశాడు.. గోపాలపురంలో ఉన్న సరోజినీదేవి రోడ్‌లోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ వ్యవహారమిది. ఈ దారుణంలో పాలు పంచుకున్న అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలతో పాటు రాజేష్‌ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పౌరసత్వం రావడంతో విక్రయాలు... పద్మారావునగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని నిర్ణయించారు. అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా సీనియర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేసిన రవి కాట్రగడ్డతో ఇప్పటికీ స్నేహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అంజిరెడ్డి తన ఆస్తుల విక్రయం విషయం ఆయనకు ఎనిమిది నెలల క్రితం చెప్పి అమెరికా వెళ్లారు. రవి ఈ అంశాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. నెల రోజుల క్రితం భార్యతో తిరిగి వచి్చన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజే‹Ùను తీసుకువచ్చారు. ఇంటిపై మక్కువను గుర్తించి.. అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్‌లోని ఇల్లు తనకు నచి్చందని, తాను ఖరీదు చేస్తానని అంజిరెడ్డితో పాటు ఆయన భార్యతోనూ నమ్మబలికాడు. 1986లో కట్టిన ఆ ఇంటిపై భార్యాభర్తలకు ఉన్న మక్కువను గుర్తించిన రాజేష్.. వారిని బుట్టలో వేసుకునేలా మాట్లాడాడు. ఆ ఇంటిని పడగొట్టనని, మరింత అందంగా తీర్చుదిద్దుతానని తరచూ చెబుతుండేవాడు. సైదాబాద్‌లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. దాన్ని ఖరీదు చేయడానికి ఓ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పాడు. తమ ఆస్తుల్ని విక్రయించిన ఇద్దరు మహిళలు ఇది ఖరీదు చేయడానికి అంగీకరించారంటూ అంజిరెడ్డితో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్ వారితో చెప్పాడు. దీంతో భార్య వెళ్లగా.. అంజిరెడ్డి ఇక్కడే ఉండిపోయారు. పథకం ప్రకారం డ్రాఫ్ట్ సిద్ధం చేసి.. ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్‌లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడు. దీనికోసం రెండు విడతల్లో ఆయనకు రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వయోవృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డి మేడ్చల్‌లోని అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఖరీదు చేయాలని భావించారు. గత నెల 29 ఉదయం పద్మారావునగర్‌కు వెళ్లిన రాజే‹Ù... అంజిరెడ్డిని తీసుకుని మేడ్చల్ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసిన భార్యతో అంజిరెడ్డి అదే విషయం చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్‌రెడ్డి ఎన్నిసార్లు ప్రయతి్నంచినా అంజిరెడ్డి ఫోన్ కలవలేదు. అంతా కలిసి హత్య చేశారు.. అంజిరెడ్డి, రాజేష్ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో జీఆర్ కన్వెన్షన్ ఉన్న డీమార్ట్ బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. బేస్మెంట్– 3లో అంజిరెడ్డి కారు పార్క్ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆపై మృతదేహాన్ని బేస్మెంట్–3లోని ఆయన కారు వద్దకు తీసుకువచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు చరణ్‌కు ఫోన్ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. హుటాహుటిన వచి్చన ఆయన బేస్మెంట్–3లో కారు పార్క్ చేసి ఉండటం, దాని పక్కనే అంజిరెడ్డి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. గోపాలపురం పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో హత్యగా తేల్చారు. రాజేష్ సహా అయిదుగురినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా?
దక్షిణాఫ్రికా రాజకీయనేత జూలియస్ మలేమా ఒక భారీ ర్యాలీకి సారధ్యం వహిస్తూ, జాతి హింసాత్మక నినాదాలతో రాజకీయాలను మరింత వేడెక్కించారు. ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ నాయకుడు మలేమా దక్షిణాఫ్రికాలోని డచ్ సెటిలర్లు లేదా బోయర్స్, శ్వేతజాతీయులను సూచిస్తూ "కిల్ ది బోయర్, ది ఫార్మర్" అనే జాతి విధ్వంసక వ్యతిరేక పోరాట గీతాన్ని ఆలపించారు. వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా రాజకీయాల్లో ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ అక్కడి ప్రముఖ రాజకీయ శక్తులలో ఒకటిగా అవతరించింది. నిజానికి మలేమా.. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ)లో యువనేత. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి నేత నెల్సన్ మండేలా నేతృత్వంలో శక్తమంతంగా ఎదిగింది. దక్షిణాఫ్రికా శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చినందుకు మలేమా ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్నారు. దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రటిక్ అలయన్స్ (డీఏ) నేత జాన్ స్టీన్హుయిసెన్ తాజాగా మలేమా వ్యాఖ్యలను ఖండిస్తూ, అతను అంతర్యుద్ధాన్ని ప్రేరేపించాలని నిర్ణయించుకున్న వ్యక్తి అని అభివర్ణించారు. మలేమా.. రక్తపిపాసి అని, నిరంకుశుడు అని, సామూహిక హత్యకు పిలుపునిచ్చాడని ఆయన ఆరోపించారు. మలేమా తీరుపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో డీఎ ఫిర్యాదు చేస్తుందని కూడా ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: బాల భీములు పెద్దోళ్లయిపోయారు.. ఇప్పుడు ఉన్నారిలా.. కాగా ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ (ఈఎఫ్ఎఫ్) నూతన పార్టీ అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పార్టీ జనాదరణ పొందుతున్నట్లు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. శ్వేతజాతి ఓటర్లకు మద్దతుగా నిలిచే ఉదారవాద డీఏ పార్టీ దాదాపు 16 శాతం ఓట్లను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ఫ్రాన్స్ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికన్లలో నల్లజాతీయులకు భూ యాజమాన్యహక్కులను కల్పించేందుకు పాటుపడుతూ, భూ సంస్కరణల కోసం వాదించే ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ (ఈఎఫ్ఎఫ్) దాదాపు 13 శాతం ఓటర్లకు ఆకట్టుకుంటోందని తెలిపింది. South Africa’s black party sings “kill the Boer (Whites), kill the White farmer”. pic.twitter.com/JdPg9Okgnj — Truthseeker (@Xx17965797N) July 30, 2023 జూలియస్ మలేమా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని పదే పదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన జాతివిద్వేష పూరిత పాటలను పాడారంటూ పౌర హక్కుల సంఘం ఆఫ్రిఫోరమ్ అతనిని కోర్టుకు లాగింది. మలేమా జాతి విద్వేషపూరిత ప్రసంగం చేస్తూ, వివక్షను వ్యతిరేకించారని బీబీసీ ఆమధ్య ఈఎఫ్ఎఫ్ పదేళ్ల వార్షికోత్సవ కథనంలో పేర్కొంది. 2019లో ఇదే విధమైన ర్యాలీలో.. సమానత్వాన్ని స్థాపించడానికి, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మలేమా ప్రకటించారు. ‘శ్వేతజాతీయులారా, మాకు కావలసింది డిన్నర్ టేబుల్‌పై మీతో సమానంగా కలసి భోజనం చేయడమే’ అని సోవెటోలోని ఓర్లాండో స్టేడియంలో వేలాది మంది అనుచరుల మధ్య ఆయన పేర్కొన్నారు. ‘మేము మీతో పాటు టేబుల్ వద్ద కూర్చోవడం మీకు ఇష్టం లేకపోతే, టేబుల్‌ను నాశనం చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు’ అని మలేమా పేర్కొన్నారు. తమ పార్టీ దక్షిణాఫ్రికా నల్లజాతీయులకు సమానత్వం అందించాలని కోరుకుంటున్నదని, శ్వేత జాతీయులకు వ్యతిరేకం కాదని మలేమా తెలిపారు. 2019లో మలేమా మాట్లాడుతూ తాము ముందుగా భూమి సమస్యకు పరిష్కారం కోరుతున్నాం. పరిహారం అవసరంలేని విధంగా భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామన్నారు. తద్వారా నల్లజాతీయులకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నామన్నారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన బిలియనీర్ ఎలోన్ మస్క్.. మలేమా వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయన జాతి నిర్మూలనకు పురిగొల్పుతున్నారని వ్యాఖ్యానించారు. మలేమా వ్యాఖ్యలపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఎందుకు స్పందించడం లేదని మస్క్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: వారి ఇలాకాలో కాలు మోపితే.. ఎవరికైనా నెక్స్ట్ బర్త్‌డే ఉండదు! -
అణుబాంబు ఆవిష్కర్తకు భారత పౌరసత్వం.. నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించిన ఓపెన్‌హైమర్!
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ‘ఓపెన్‌హైమర్’ సినిమా విడుదల అయిన నేపధ్యంలో అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ జీవితం గురించి తెలుసుకోవానే ఆసక్తి పలువురిలో నెలకొంది. ఇటీవలే విడుదలైన ఒక పుస్తకంలో ప్రముఖ శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్కు భారత్‌తో ముడిపడి ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. భారత దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్కు భారత పౌరసత్వం ఆఫర్ చేశారనే విషయం ఆ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ భారతీయ పార్సీ రచయిత భక్తియార్ కే దాబాభాయి భారత శాస్త్రవేత్త హోమీ భాభా జీవితం ఆధారంగా రచించారు. రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక.. ఈ పుస్తకంలో అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్- హోమీ బాబాల స్నేహానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. ‘హోమీ జే భాభా: ఏ లైఫ్’ పేరుతో భక్తియార్ కే దాదాభాయి రాసిన ఈ పుస్తకంలో ‘రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌ను భాభా కలుసుకున్నారు. అనంతరం వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. భాభా మాదరిగానే రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ కూడా గౌరవమర్యాదలతో మెలిగిన వ్యక్తి. రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ సంస్కృత భాషను కూడా నేర్చుకున్నారు. దీనితో పాటు ఆయనకు లాటిన్, గ్రీకు భాషలు కూడా వచ్చు’ అని పేర్కొన్నారు. బాంబు తయారీ వరకే తన బాధ్యత.. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ తయారు చేసిన అణుబాంబును రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హీరోషిమా, నాగసాకిలో ప్రయోగించారు. అయితే అంతటి శక్తిమంతమైన బాంబు తయారు చేయడం తగినది కాదని రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌పై విమర్శలు వచ్చాయి. దీనికి ఆయన సమాధానమిస్తూ బాంబు తయారు చేయడం వరకే తన బాధ్యత అని, దానిని ఎలా వినియోగించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడంతో తనకు సంబంధం లేదన్నారు. తాను అమెరికా విడిచిపెట్టబోనంటూ.. అయితే ఆ తరువాత రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ తన వైఖరిని మార్చుకున్నారు. దీనికిమించిన శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు తయారీని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో అతనికి అమెరికా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అప్పటివరకూ అతని ఇచ్చిన రక్షణ వ్యవస్థను కూడా తొలగించారు. ఆ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం సరిగ్గా అదే సమయంలో నాటి భారత ప్రధాని నెహ్రూ.. శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్హైమర్కు భారత పౌరసత్వం ఇవ్వజూపారు. అయితే ఆయన దీనిని తిరస్కరించారు. అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలన్నింటి నుంచి విముక్తి కలిగేవరకూ తాను అమెరికా విడిచిపెట్టబోనని ఓపెన్‌హైమర్ స్వయంగా నెహ్రూకు తెలియజేశారట. రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ అమెరికా దేశభక్తుడైనందున కూడా ఈ ఆఫర్ తిరస్కరించారని కూడా నిపుణులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. -
చెత్త సేకరణపై నిఘా.. సిటిజన్ యాప్‌ను రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ‘క్లాప్’మిత్రలు రోజూ చెత్తను సేకరిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ యాప్ అ్రస్తాన్ని ప్రయోగిస్తోంది. ఇందుకోసం ‘సిటిజన్ యాప్’ను రూపొందించింది. దీనిని ప్రతీ కుటుంబంలో స్మార్ట్ఫోన్లు ఉన్న వారితో పంచాయతీ కార్యదర్శులు, క్లాప్‌మిత్ర (క్లీన్ ఆంధ్రప్రదేశ్)లు డౌన్లోడ్ చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 99,84,421 కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు 67,08,960 మంది తమ ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. మిగిలిన కుటుంబాల వారికీ ఆ యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కుటుంబాలు ఈ యాప్‌ను ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నాయి. బదులిచ్చేవారు తక్కువే.. మరోవైపు.. చెత్త సేకరణపై పంపే మెసేజ్‌లకు ప్రతిస్పందిస్తున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు పంచాయతీరాజ్ శాఖాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 70 లక్షల ఇళ్ల నుంచి రోజూ చెత్త సేకరణ చేస్తున్నట్లు వారు తెలిపారు. వీటిలో దాదాపు 50 లక్షల కుటుంబాలకు పైగానే రోజూ మెసేజ్‌లు పంపుతున్నామని.. కానీ, బదులిస్తున్న వారి సంఖ్య ఐదువేలలోపే ఉంటోందన్నారు. 20 రోజుల క్రితమే ఈ యాప్ ప్రక్రియ మొదలైందని.. అందరూ దానిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవడానికి మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే గ్రామాల్లో చెత్త సేకరణకు యాప్ పూర్తిస్థాయిలో దోహదపడుతుందని వారు చెబుతున్నారు. చెత్త సేకరణపై రోజూ మెసేజ్‌లు.. ఇక సిటిజన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న ప్రతీ ఫోనుకు ‘ఈ రోజు మీ ఇంటి నుంచి చెత్తను సేకరించారా’ అని ప్రశ్నిస్తూ ‘ఎస్’ లేదా ‘నో ’ చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మెసేజ్ పంపుతోంది. ఎవరైనా ‘నో’ అని బదులిస్తే, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి ద్వారా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, క్లాప్‌మిత్ర నుంచి వివరణ కోరతారు. అదే రోజు లేదా మర్నాడు ఆ ఇంటి నుంచి చెత్తను సేకరించేలా మండల, జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపడతారు. చదవండి:‘బల్క్’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు -
అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..!
ఆఫ్గనిస్తాన్ మళ్లీ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లడంతో దేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరగుతుందనే భయం అఫ్గన్ పౌరులను వెంటాడుతుంది. మెజారిటీ ప్రజలు దేశం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ఎటీఎమ్‌లు మూతపడ్డాయి. అఫ్గన్ పౌరులు తమ బ్యాంకు ఖాతాలనుంచి డబ్బులను ఉపసంహరించడం కోసం భారీగా క్యూ కట్టారు. దేశ వ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. స్ధానిక మార్కెట్లో ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. చదవండి: దాల్ సరస్సులో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్ తాలిబన్ల రాకతో స్థానిక కరెన్సీ విలువ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఓకవైపు మూసివేసిన దేశ సరిహద్దులతో అఫ్గన్ పౌరులు నానా అవస్థలను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల రాకతో అఫ్గన్ పౌరుల జీవితాల్లో ఆర్థిక అస్థిరత నెలకొంది. దేశంలో ఉన్న తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొడానికి, అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్‌లో ఇప్పటీకి ఎక్కువగా నగదు చెలామణీలో ఉంది. అఫ్గనిస్తాన్‌లో ఉన్న గడ్డు పరిస్థితులను ఎదుర్కోడానికి అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం కోసం..క్రిప్టోకరెన్సీ వాడకాన్ని ఎలా వాడాలనే విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు ఎక్కడా ట్రాక్ చేస్తారనే భయంతో వీపీఎన్, ఐపీలను చేంజ్ చేస్తూ క్రిప్టోకరెన్సీ గురించి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీ గురించి తెలిసిన అఫ్గన్ పౌరులను అడిగిమరి తెలుసుకుంటున్నారు. కాబూల్‌లో తిరుగుబాటు జరగడానికి ముందు జూలైలో ఆఫ్ఘనిస్తాన్‌లో “బిట్‌కాయిన్” “క్రిప్టో” కోసం వెబ్ సెర్చ్‌లు బాగా పెరిగాయని గూగుల్ ట్రెండ్స్ డేటా చూపించింది. తాజాగా ఇప్పుడు గూగుల్ క్రిప్టోకరెన్సీపై మరింత సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలిసిస్ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో క్రిప్టోకరెన్సీ స్వీకరణపరంగా అఫ్గనిస్తాన్ 20వ స్థానంలో నిలవడం గమనార్హం. చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..! -
కరోనా వైరస్‌కు అమెరికా పౌరుడు బలి
బీజింగ్: కరోనా రేపిన వైరస్ ప్రకంపనలు రోజుకు రోజుకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే చైనాలో 700 మందికి పైగా పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి విజృంభిస్తున్న తీరు మరింత ఆందోళన రేపుతోంది. కరోనా మోగిస్తున్న మృత్యు ఘంటికలు వివిధ దేశాలను వణకిస్తున్నాయి. తాజాగా కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన అమెరికా పౌరుడు (60) ఫిబ్రవరి 6న చైనాలోని వుహాన్‌లో ఆసుపత్రిలో మరణించాడు. బీజింగ్ లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి వుహాన్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ చనిపోయాడు. అయితే కరోనా వైరస్‌ను నిర్ధారించలేమని, తీవ్రమైన న్యుమోనియా కారణమని భావిస్తున్నట్టు రాయబార కార్యాలయ ప్రకటన తెలిపింది. చైనాలో ఇప్పటికే 722 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా, 34వేల మందికి పైగా ఈ వరస్ సోకినట్లు తాజా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం నాటికి, కరోనావైరస్ సోకిన విదేశీయుల19 కేసులు నమోదయ్యాయి, వాటిలో ఇద్దరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగా, మిగిలిన 17 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. -
సిటిజన్ ఫైట్
-
‘ఈశాన్యం’లో కొత్త చిచ్చు!
బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో వేధింపులు ఎదుర్కొంటున్న ముస్లిమేతర(హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ) వర్గాల పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వ చట్టం సవరణ బిల్లు ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త వివాదం రేకెత్తించడం ఖాయమని అక్కడి పరిణామాలు చెబుతున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి అసోం గణపరిషత్ (ఏజీపీ) తప్పుకుంది. మేఘాలయ, మిజోరంలలో సైతం కూటమి భాగస్వామ్యపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా, మిజోరం సీఎం జోరం తంగా సవరణ బిల్లు ఈశాన్య ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని చెప్పారు. త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్, మణిపూర్ రాష్ట్రాల్లో సైతం మిత్రపక్షాలనుంచి ఇలాంటి నిరసనలే వ్యక్త మవుతున్నాయి. 2016లో ఈ బిల్లును తొలిసారి పార్లమెంటులో ప్రతిపాదించినప్పుడు అస్సాం లోని వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పటినుంచీ అది సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనలో ఉండిపోయింది. 30మంది సభ్యులున్న జేపీసీ ఆ బిల్లు అస్సాం ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధం కాదని తేల్చాక మంగళవారం దాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం పూర్తయింది. అయితే విపక్షాల ఆధిక్యత ఉన్న రాజ్యసభలో బుధవారం దాన్ని ప్రవేశపెట్టడానికి అవాంతరాలు ఎదురయ్యాయి. ఈలోగా సభ నిరవధిక వాయిదా పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో, ప్రత్యేకించి అస్సాంలో జాతి సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో బీజేపీ అధి నాయకత్వం సరిగా అంచనా వేయడం లేదని ఈ సవరణ బిల్లు చూస్తే అర్ధమవుతుంది. ఒకపక్క జాతీయ పౌర గుర్తింపు(ఎన్ఆర్సీ) వ్యవహారం ఇంకా తేలలేదు. ఈలోగా పౌరసత్వ సవరణ బిల్లు రంగంలోకొచ్చింది. అస్సాంను పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి పొరు గునున్న బంగ్లాదేశ్ నుంచి వలసలను ప్రోత్సహించాయని, అందువల్ల స్వరాష్ట్రంలో తాము మైనారి టీలుగా మారే ప్రమాదం ఏర్పడిందని అక్కడి ప్రజలు ఆందోళన చేశారు. విదేశీయులను తక్షణం బయటికి పంపేయాలంటూ అక్కడ 1979–85 మధ్య మహోధృతంగా ఉద్యమం సాగింది. చివరకు 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి, అస్సాం ఉద్యమకారులకూ మధ్య ఒప్పందం కుదర డంతో ఉద్యమం ఆగింది. దాని ప్రకారం అక్రమ వలసలను నిర్ధారించడానికి 1971ని ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకున్నారు. తాజా బిల్లు దాన్ని బేఖాతరు చేసి 2014 డిసెంబర్‌కు ముందు వలస వచ్చిన వారికి సైతం పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పిస్తోంది. జాతీయ పౌర గుర్తింపు(ఎన్ఆర్సీ) ప్రక్రియపై ఉన్న వివాదమే ఎటూ తేలకుండా ఉన్న స్థితిలో తాజా బిల్లు ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త జగ డానికి కారణమైంది. అస్సాం ఉద్యమం అక్రమ వలసలకు వ్యతిరేకంగా సాగిన మాట వాస్తవమే అయినా దానిలో కేవలం ముస్లిం వ్యతిరేకతను మాత్రమే చూడటం బీజేపీ తప్పిదం. అది మౌలి కంగా జాతి సమస్య. వారు వ్యతిరేకిస్తున్నది ‘విదేశీయులను’ మాత్రమే తప్ప ముస్లింలను కాదు. అక్రమ వలసదారులపై అస్సాంలో ఉన్న వ్యతిరేకతను ఆసరా చేసుకుని ఈ పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో వేధింపులకు గురవుతున్న హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలకు ఈ దేశ పౌరసత్వం ఇస్తామంటే అస్సాం అయినా, ఈశాన్యంలోని ఇతర రాష్ట్రాల ప్రజలైనా అంగీకరించరు. ఈ సవరణ బిల్లు ఆమోదం పొందకపోతే అస్సాం ‘జిన్నాల’ వశమవుతుందని అస్సాంమంత్రి హిమంత బిశ్వా శర్మ చేసిన హెచ్చరికే బీజేపీ ఉద్దేశాలను బయటపెడుతోంది. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి అక్రమ వలసలను ప్రోత్సహిస్తే, బీజేపీ ‘చట్టబద్ధంగా’ ఆ పని చేయదల్చుకున్నట్టు కనబడుతోంది. పరిమిత వనరులుండి, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్నచోట వలసదారులు పెరుగుతుంటే స్థానికుల్లో ఆందోళన సహజం. వారు వనరులపై ఆధిపత్యాన్ని పెంచుకుంటుంటే ఆ ఆందోళన కాస్తా వైషమ్యాలకు బీజం వేస్తుంది. అస్సాంలో జరిగింది ఇదే. అస్సాం ఉద్యమం తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింల సంగతలా ఉంచి 19వ శతాబ్దిలో అస్సాం టీ ప్లాంటే షన్లలో పనిచేయడానికి వెళ్లిన అవిభక్త బెంగాల్ ముస్లింలను కూడా శతాబ్దాలు గడిచినా విదేశీయు లుగానే చూసే ధోరణి ఏర్పడింది. దానికి సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనడమే జటిలంగా మారగా...ఇప్పుడు ఆ మూడు దేశాల్లోని ముస్లిమేతర వర్గాలకు చెందిన పౌరుల్ని తీసుకురావడానికి ప్రయత్నించడం కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఇలా వచ్చేవారి భారాన్ని ఒక్క అస్సాం మాత్రమే భరించనవసరం లేదని, దేశంలోని అన్ని రాష్ట్రాలూ పంచుకుంటాయని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇస్తున్న హామీ ఈశాన్య రాష్ట్రాల ప్రజలను సంతృప్తిపరచదు. పైగా ఇతర రాష్ట్రాలు కూడా అంత ఉన్నత స్థితిలో లేవు. ఉన్న జనాభాకు మౌలిక సదుపాయాలు కల్పించడమే వాటికి కష్ట మవుతోంది. వేరే దేశాల్లో ప్రాణాలకు ముప్పు ఏర్పడినవారికి ఆశ్రయం ఇవ్వాలనుకోవడం ఉన్నతమైన విలువే. దాన్నెవరూ కాదనరు. కానీ అందుకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం అభ్యంతరకరం. ఇక బంగ్లా, పాక్, అఫ్ఘాన్లలో ముస్లిమేతర పౌరులే కాదు... ముస్లింలలో భాగంగా ఉంటున్న అహ్మదీయ వంటి తెగలవారు కూడా అణచివేతకు గురవుతున్నారు. వారి విషయంలో అభ్యంతరం ఎందుకుండాలో అర్ధం కాదు. ఒకపక్క ఉన్న సమస్యలనే ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఈశాన్య రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. అరుణాచల్‌లో ఇరుగు పొరుగునుంచి వచ్చి పడే చక్మాల గురించి... మిజోరంలో త్రిపుర నుంచి వలసవచ్చే రీంగ్ తెగ, మయన్మార్ నుంచి వచ్చే బర్మా తెగ పౌరుల గురించి...అస్సాం, మణిపూర్, మేఘాలయల్లో బంగ్లాదేశీయుల గురించి ఆందో ళనలున్నాయి. అవి చాలవన్నట్టు కొత్త సమస్యను రాజేయడం భావ్యం కాదు. ఈ సవరణ బిల్లు ఆలోచనను విరమించుకోవడం ఉత్తమం. -
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముందడుగు..
కోరుట్ల టౌన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపాల్టీ ప్రగతి పథంలో దూసుకుపోతుంది. దేశంలో 40 41 నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పోటీపడుతూ పరిసరాల పరిశుభ్రత, 100 శాతం సానిటేషన్, పారిశుధ్యం పనులు, తడి, పొడి చెత్త సేకరణ, ఉదయం, రాత్రి వేళల్లో జాతీయ రహదారితోపాటు, ప్రధాన రహదారులు పరిశుభ్రం చే స్తూ, చెత్త రహిత మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతున్న క్రమంలో మందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఫీడ్‌బ్యాక్‌లో దేశ ంలో 44వ స్థానం, రాష్ట్రంలో 2వ స్థానంలో కొనసాగుతుంది. కోరుట్ల బడ్డీ యాప్‌కు స్పందన.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కోరుట్ల పట్టణంలోని ప్రజలకు తమ సమస్యలు పరిష్కారానికి, పన్నులు ఆన్లైన్లో చెల్లించడానికి కోరుట్ల బడ్డీ యాప్ రూపొందించి, ప్రచారం చేశారు. ప్రధాన చౌరస్తాల్లో ప్రచారబోర్డులపై అవగాహన కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రజలను భాగస్వాములు చేసేందుకు 31వార్డుల్లో విస్తృత ప్రచారం చేస్తూ, ప్రధాన కూడళ్ళు, కళాశాలల్లో, దుకాణా ల వద్ద బడ్డీ యాప్ ప్రచారం చేశారు. వాల్ పోస్టర్, గోడ రాతలతో బొమ్మలు వేయించారు. కోరుట్ల బడ్డీ యాప్‌కు స్పందన లభించింది. జనవరి 8, 9 రెండు రోజులు స్వచ్ఛ సర్వేక్షణ్ పనితీరుపై పర్యవేక్షకులు కోరుట్లకు చేరుకుని వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. 2 నెలల్లో 2500 మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. 700 మంది తమ సమస్యల పరిష్కారానికి బడ్డీ యాప్‌ను వినియోగించుకోగా 654 సమస్యలు వెంటనే పరిష్కరమయ్యాయి. 46 సమస్యలు ఆర్థిక వనరులతో చేపట్టాల్సిన అవసరం ఉండడంతో నిధులు రాగానే పనులు పూర్తి చేయనున్నట్లు పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ ఎ.మహిపాల్ పేర్కొన్నారు. షీ టాయిలెట్స్ నిర్మాణం మున్సిపల్ నిధులతో రూ. 2లక్షలు వెచ్చించి, గురుజు మార్కెట్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా షీ టాయిలెట్స్ నిర్మాణం చేశారు. మహిళలకు టాయిలెట్స్ ఇబ్బందులు తీర్చారు. ప్రత్యేకంగా మహిళ సిబ్బందిని ఏర్పాటు చేసి, టాయిలెట్స్ నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. రహదారులు పరిశుభ్రం పట్టణంలోని జాతీయ రహదారి, ప్రధాన రహదారులు, బిజినెస్ కూడళ్ళ దారులు టీచర్స్క్లబ్ రోడ్, ఇందిరారోడ్, ఐబీరోడ్లను రాత్రివేళల్లో ఊడ్చివేయిస్తున్నారు. మిగతా రహాదారులు ఉదయం వేళ పరిశుభ్రం చేయిస్తూ, చెత్త రహిత రహదారులుగా పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. సానిటేషన్పై ప్రత్యేకశ్రద్ధ పెట్టి, అవసరమైన చోట మురికి కాలువలు నిర్మాణం చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో.. స్వచ్ఛ సర్వేక్షణ్కు ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రథమస్థానం దేశంలో మంచి స్థానం పదిలం చేసేం దుకు ప్రతీ రోజు పనులతీరును పర్యవేక్షిస్తున్నాం. రహదారులు పరిశుభ్రంగా ఉండేందుకు ఉదయం, రాత్రి వేళల్లో క్లీన్ చేయిస్తున్నాం. రోడ్లపై చెత్త వేయకుండా అన్ని చర్యలు తీసుకొని, అందంగా ఉంచుతున్నాం. – అల్లూరి వాణిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
కలకలం.. పాక్ వ్యక్తికి ఆధార్ కార్డు!
సాక్షి, న్యూఢిల్లీ : యూఐడీఏ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఓ పాకిస్థానీ ఆధార్ కార్డుతో పట్టుబడటం కలకలం రేపింది. భారత పౌరసత్వం లేకపోయినా ఆధార్ కార్డు ఎలా జారీ చేశారన్న అంశంపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే... పాకిస్థాన్‌కు చెందిన పుర్ఖా రామ్ 2000 సంవత్సరంలో పాక్ నుంచి రాజస్థాన్‌కు వచ్చి స్థిరపడ్డాడు. కూలీ పనులు చేసుకునే రామ్.. భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ క్రమంలో గత నెలలో జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అతను తచ్చాడుతుండగా భద్రతా సిబ్బంది గమనించారు. అనుమానంతో అతని బ్యాగ్ తనిఖీ చేయగా వారికి అందులో పాకిస్థాన్ పాస్‌పోర్టు, ఆధార్ కార్డు దర్శనమిచ్చాయి. వెంటనే అప్రమత్తమై అతని అరెస్ట్ చేశారు. పోలీసులతోపాటు పలు భద్రతా ఏజెన్సీలు అతన్ని సుదీర్ఘంగా ప్రశ్నించాయి. కానీ, విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూడకపోవటంతో చివరకు అతన్ని వదిలేశారు. అయినప్పటికీ పౌరసత్వం లేకపోయినా ఆధార్ కార్డును కలిగి ఉండటంతో అతనిపై విజయ్‌నగర్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రామ్‌కు ఆధార్ కార్డు ఎలా మంజూరు అయ్యింది? అన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. జాతీయత, వ్యక్తిగత వివరాలు తదితర అంశాలను తగిన పత్రాలతో ధృవీకరించుకున్నాకే ఆధార్ కార్డును యూఐడీఏ మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ, అందుకు విరుద్ధంగా ఏజెంట్లు అతనికి కార్డు ఎలా ఇచ్చారన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. -
ప్రతి పౌరుడికీ స్మార్ట్ కార్డు
జాతీయ జనాభా పట్టిక ఆధారంగా జారీకి కేంద్రం కసరత్తు సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి పౌరుడికీ స్మార్ట్ కార్డు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ జనాభా పట్టికలోని వివరాల ఆధారంగా ఈ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ కార్డు బహుళ ప్రయోజనాలున్న గుర్తింపు కార్డుగా ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ సర్వే పూర్తయింది. హైదరాబాద్‌లోనూ ఈ సర్వేను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని తాజాగా సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని ఆదేశించింది. జాతీయ జనాభా పట్టిక రూపకల్పనపై గురువారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఢిల్లీలో ఒక సదస్సు జరిగింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఈ భేటీకి హాజరయ్యారు. సర్వే పూర్తయిన వెంటనే జాతీయ జనాభా పట్టికను రాష్ట్రాల వారీగా ప్రచురించి.. అభ్యంతరాలు, ఫిర్యాదులకు కొంత గడువు ఇస్తారు. వాటిని పరిష్కరించి తుది జాతీయ జనాభా పట్టిక తయారుచేస్తారు. దీని ఆధారంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్ఆర్ఐసీ-భారత పౌరుల పట్టిక)ను రూపొందిస్తారు. ఈ రిజిస్టర్‌లోని వివరాల ఆధారంగా స్మార్ట్‌కార్డులు జారీ చేస్తారు. -
ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు
బహుళ ప్రయోజన కార్డుగా జారీ హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే... మే నెలాఖరు గడువు సాక్షి, హైదరాబాద్: ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్)లోని వివరాల ఆధారంగా ఈ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. దేశంలోనే ప్రతి పౌరుడికి ఈ కార్డును జారీ చేస్తుంది. ఆధార్ కార్డును, మొబైల్ ఫోన్ నెంబర్‌ను దీనితో అనుసంధానం చేస్తుంది. ఈ కార్డు బహుళ ప్రయోజనాలున్న గుర్తింపు కార్డుగా ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఐడీ కార్డుగా, అడ్రస్ ప్రూఫ్‌గా పనికొస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందేందుకు ఇదే ప్రధాన ఆధారంగా ఉంటుంది. ఈ కార్డుల జారీ ప్రక్రియను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. అందుకు వీలుగా ఇంటింటి సర్వేను పూర్తి చేసి తుది జాతీయ జనాభా పట్టికను తయారు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియ కారణంగా గ్రేటర్ పరిధిలో సర్వే జరగలేదు. హైదరాబాద్‌లోనూ ఈ సర్వేను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని తాజాగా సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా గతంలో జనగణన సందర్భంగా ఇచ్చిన వివరాలను ఆధార్ కార్డు నెంబర్లు, మొబైల్ నెంబర్లతో అనుసంధానం చేస్తారు. అప్పుడు ఇచ్చిన వివరాల్లో మార్పులు చేర్పులు తప్పు ఒప్పులున్నా సవరిస్తారు. జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో న్యూఢిల్లీలో గురువారం వర్క్‌షాప్ జరిగింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య దీనికి హాజరయ్యారు. ఈ సర్వే పూర్తయిన వెంటనే జాతీయ జనాభా పట్టికను రాష్ట్రాల వారీగా ప్రచురించి.. అభ్యంతరాలు, ఫిర్యాదులకు కొంత గడువు ఇవ్వనుంది. వీటన్నింటినీ పరిష్కరించి సమగ్రంగా తుది జాతీయ జనాభా పట్టికను రూపొందిస్తారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్ఆర్ఐసీ-భారత పౌరుల పట్టిక)ను రూపొందిస్తోంది. కార్డుల జారీకి దీనిని ప్రామాణికంగా గుర్తిస్తుంది. -
పౌరుడికే తొలి ప్రాధాన్యం: మోదీ
పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని సుపరిపాలనా దినోత్సవ సందేశం న్యూఢిల్లీ: ‘పౌరుడికే తొలి ప్రాధాన్యం’ అన్న పరిపాలనా మంత్రం ప్రాతిపదికగా సామాన్య పౌరుల సంక్షేమం లక్ష్యంగా గత ఏడు నెలలుగా తమ ప్రభుత్వం పనిచేసిందని, పారదర్శకమైన, జవాబుదారీతనంతో పరిపాలనను ప్రజలకు అందించేందుకే తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సామాన్య పౌరుల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 90వ జన్మదినాన్ని ‘సుపరిపాలనా దినం’గా పాటిస్తున్న సందర్భంగా ప్రధాని గురువారం ఒక సందేశం ఇస్తూ, జవాబుదారీతనంతో కూడిన పటిష్టమైన పారదర్శక పాలనను అందిస్తామన్న తమ వాగ్దానాన్ని నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వ పరిపాలనా ప్రక్రియను పునర్వ్యవస్థీకరిస్తున్నామని అన్నారు. ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలకు, విభాగాలకు ఈమేరకు ఆదేశాలు వెళ్లాయని, తమ పరిధిలోకి వచ్చే రంగాలను మరింత సరళీకరించి, హేతుబద్ధంగా విధానాలు అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించామని మోదీ తెలిపారు. దేశ ప్రగతికి సుపరిపాలన కీలకమైనదని, ప్రభుత్వ పరిపాలనను పౌరులకు చేరువగా తీసుకెళ్లి, తద్వారా పాలనా ప్రక్రియలో పౌరులను కూడా క్రియాశీలక భాగస్వాములుగా చేయాలన్నదే తన ఆశయమని మోదీ తెలిపారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతోనే mygov.in వంటి వెబ్‌పోర్టల్స్‌ను ప్రారంభించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వంలో ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు పౌరులకు ఎలక్ట్రానిక్ మార్గంలో అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ ఇండియా పథకం దోహదపడుతుం దన్నారు. టూరిస్టుల కోసం హెల్ప్‌లైన్ దేశీయ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా పర్యాటకుల కోసం హెల్ప్‌లైన్ నంబర్(1800-111-363)ను కేంద్రం నేడు ప్రారంభించనుంది. అలాగే ‘వెల్కమ్’ కార్డును ఆవిష్కరించనుంది. వేధింపులు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు పర్యాటకులు ఈ నంబర్‌ను సంప్రదిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు. త్వరలో దుకాణాల్లోనూ మినీ ఎల్పీజీ వినియోగదారులకు వంటగ్యాస్ (ఎల్పీజీ) సులభంగా లభ్యమయ్యేందుకు 5కేజీల మినీ సిలిండర్లను త్వరలో ఎంపికచేసిన పెట్రోల్ బంకులు, దుకాణాల్లోనూ అందుబాటులోకి తెస్తున్నారు. గురువారం జాతీయ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఢిల్లీలో పునఃప్రారంభించారు. -
13 నుంచి ఆర్టీఏ మొబైల్ గవర్నెన్స్ ప్రారంభం
హైదరాబాద్ : రవాణా శాఖ అందజేసే పౌరసేవలు వినియోగదారులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు, వాటికి కేటాయించిన నంబర్లకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా వాహనదారులకు అందజేసే సరికొత్త మొబైల్ గవర్నెన్స్‌ను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. వినియోగదారులు వాహనాన్ని కొనుగోలు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లవ లసి ఉంటుంది. ఆ వాహనానికి అధికారులు కేటాయించిన నంబర్ తదితర అంశాలను ఎస్సెమ్మెస్ రూపంలో చేరవేస్తారు. అంతేకాకుండా రవాణా వాహనాలు చెల్లించవలసిన త్రైమాసిక పన్నులు, గడువు ముగిసిన పర్మిట్లు, వాహన బదలాయింపు, చిరునామా మార్పు వంటి అన్ని రకాల పౌరసేవలపై మొబైల్ సందేశాల ద్వారా వాహనదారులను అప్రమత్తం చేయనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ జగదీశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు. వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, సకాలంలో పన్నులు చెల్లించకపోయినా రవాణా శాఖ నుంచి వాహనదారుడి సెల్‌ఫోన్‌కు హెచ్చరికలు అందుతాయి. మొదట కొత్త వాహనాలను మొబైల్ గవర్నెన్స్ పరిధిలోకి తెస్తారు. ఆ తరువాత పాత వాహనాలను కూడా దీని పరిధిలోకి తెచ్చేందుకు వాహనదారులు తమ మొబైల్ నంబర్లను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు.