దక్షిణాఫ్రికా రాజకీయనేత జూలియస్ మలేమా ఒక భారీ ర్యాలీకి సారధ్యం వహిస్తూ, జాతి హింసాత్మక నినాదాలతో రాజకీయాలను మరింత వేడెక్కించారు. ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ నాయకుడు మలేమా దక్షిణాఫ్రికాలోని డచ్ సెటిలర్లు లేదా బోయర్స్, శ్వేతజాతీయులను సూచిస్తూ "కిల్ ది బోయర్, ది ఫార్మర్" అనే జాతి విధ్వంసక వ్యతిరేక పోరాట గీతాన్ని ఆలపించారు.
వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా రాజకీయాల్లో ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ అక్కడి ప్రముఖ రాజకీయ శక్తులలో ఒకటిగా అవతరించింది. నిజానికి మలేమా.. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ)లో యువనేత. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి నేత నెల్సన్ మండేలా నేతృత్వంలో శక్తమంతంగా ఎదిగింది.
దక్షిణాఫ్రికా శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చినందుకు మలేమా ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్నారు. దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రటిక్ అలయన్స్ (డీఏ) నేత జాన్ స్టీన్‌హుయిసెన్ తాజాగా మలేమా వ్యాఖ్యలను ఖండిస్తూ, అతను అంతర్యుద్ధాన్ని ప్రేరేపించాలని నిర్ణయించుకున్న వ్యక్తి అని అభివర్ణించారు. మలేమా.. రక్తపిపాసి అని, నిరంకుశుడు అని, సామూహిక హత్యకు పిలుపునిచ్చాడని ఆయన ఆరోపించారు. మలేమా తీరుపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో డీఎ ఫిర్యాదు చేస్తుందని కూడా ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: బాల భీములు పెద్దోళ్లయిపోయారు.. ఇప్పుడు ఉన్నారిలా..
కాగా ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ (ఈఎఫ్‌ఎఫ్) నూతన పార్టీ అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పార్టీ జనాదరణ పొందుతున్నట్లు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. శ్వేతజాతి ఓటర్లకు మద్దతుగా నిలిచే ఉదారవాద డీఏ పార్టీ దాదాపు 16 శాతం ఓట్లను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ఫ్రాన్స్ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికన్లలో నల్లజాతీయులకు భూ యాజమాన్యహక్కులను కల్పించేందుకు పాటుపడుతూ, భూ సంస్కరణల కోసం వాదించే ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ (ఈఎఫ్‌ఎఫ్) దాదాపు 13 శాతం ఓటర్లకు ఆకట్టుకుంటోందని తెలిపింది.
South Africa’s black party sings “kill the Boer (Whites), kill the White farmer”. pic.twitter.com/JdPg9Okgnj
— Truthseeker (@Xx17965797N) July 30, 2023
జూలియస్ మలేమా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని పదే పదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన జాతివిద్వేష పూరిత పాటలను పాడారంటూ పౌర హక్కుల సంఘం ఆఫ్రిఫోరమ్ అతనిని కోర్టుకు లాగింది. మలేమా జాతి విద్వేషపూరిత ప్రసంగం చేస్తూ, వివక్షను వ్యతిరేకించారని బీబీసీ ఆమధ్య ఈఎఫ్‌ఎఫ్ పదేళ్ల వార్షికోత్సవ కథనంలో పేర్కొంది. 2019లో ఇదే విధమైన ర్యాలీలో.. సమానత్వాన్ని స్థాపించడానికి, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మలేమా ప్రకటించారు.
‘శ్వేతజాతీయులారా, మాకు కావలసింది డిన్నర్ టేబుల్‌పై మీతో సమానంగా కలసి భోజనం చేయడమే’ అని సోవెటోలోని ఓర్లాండో స్టేడియంలో వేలాది మంది అనుచరుల మధ్య ఆయన పేర్కొన్నారు. ‘మేము మీతో పాటు టేబుల్ వద్ద కూర్చోవడం మీకు ఇష్టం లేకపోతే, టేబుల్‌ను నాశనం చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు’ అని మలేమా పేర్కొన్నారు. తమ పార్టీ దక్షిణాఫ్రికా నల్లజాతీయులకు సమానత్వం అందించాలని కోరుకుంటున్నదని, శ్వేత జాతీయులకు వ్యతిరేకం కాదని మలేమా తెలిపారు.
2019లో మలేమా మాట్లాడుతూ తాము ముందుగా భూమి సమస్యకు పరిష్కారం కోరుతున్నాం. పరిహారం అవసరంలేని విధంగా భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామన్నారు. తద్వారా నల్లజాతీయులకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నామన్నారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన బిలియనీర్ ఎలోన్ మస్క్.. మలేమా వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయన జాతి నిర్మూలనకు పురిగొల్పుతున్నారని వ్యాఖ్యానించారు. మలేమా వ్యాఖ్యలపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఎందుకు స్పందించడం లేదని మస్క్ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: వారి ఇలాకాలో కాలు మోపితే.. ఎవరికైనా నెక్స్‌ట్ బర్త్‌డే ఉండదు!
Comments
Please login to add a commentAdd a comment