
ఆఫ్గనిస్తాన్ మళ్లీ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లడంతో దేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరగుతుందనే భయం అఫ్గన్ పౌరులను వెంటాడుతుంది. మెజారిటీ ప్రజలు దేశం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ఎటీఎమ్‌లు మూతపడ్డాయి. అఫ్గన్ పౌరులు తమ బ్యాంకు ఖాతాలనుంచి డబ్బులను ఉపసంహరించడం కోసం భారీగా క్యూ కట్టారు. దేశ వ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. స్ధానిక మార్కెట్లో ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.
చదవండి: దాల్ సరస్సులో ఎస్‌బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్
తాలిబన్ల రాకతో స్థానిక కరెన్సీ విలువ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఓకవైపు మూసివేసిన దేశ సరిహద్దులతో అఫ్గన్ పౌరులు నానా అవస్థలను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల రాకతో అఫ్గన్ పౌరుల జీవితాల్లో ఆర్థిక అస్థిరత నెలకొంది. దేశంలో ఉన్న తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొడానికి, అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్‌లో ఇప్పటీకి ఎక్కువగా నగదు చెలామణీలో ఉంది. అఫ్గనిస్తాన్‌లో ఉన్న గడ్డు పరిస్థితులను ఎదుర్కోడానికి అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం కోసం..క్రిప్టోకరెన్సీ వాడకాన్ని ఎలా వాడాలనే విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
తాలిబన్లు ఎక్కడా ట్రాక్ చేస్తారనే భయంతో వీపీఎన్, ఐపీలను చేంజ్ చేస్తూ క్రిప్టోకరెన్సీ గురించి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీ గురించి తెలిసిన అఫ్గన్ పౌరులను అడిగిమరి తెలుసుకుంటున్నారు. కాబూల్‌లో తిరుగుబాటు జరగడానికి ముందు జూలైలో ఆఫ్ఘనిస్తాన్‌లో “బిట్‌కాయిన్” “క్రిప్టో” కోసం వెబ్ సెర్చ్‌లు బాగా పెరిగాయని గూగుల్ ట్రెండ్స్ డేటా చూపించింది. తాజాగా ఇప్పుడు గూగుల్ క్రిప్టోకరెన్సీపై మరింత సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలిసిస్ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో క్రిప్టోకరెన్సీ స్వీకరణపరంగా అఫ్గనిస్తాన్ 20వ స్థానంలో నిలవడం గమనార్హం.
చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..!
Comments
Please login to add a commentAdd a comment