ఇతర భాషల్లో హిట్ అందుకున్న సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఓటీటీ వేదికలపైన ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అయ్యాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అబ్రహామింతే సంతాతికల్ ఇప్పుడు తెలుగులో వచ్చేస్తుంది. మమ్ముట్టి నటించిన ఈ సినిమా డెరిక్ అబ్రహాం పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. 2018లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సుమారు ఆరేళ్ల తర్వాత తెలుగు ఓటీటీలో విడుదల కానుంది.
మమ్ముట్టి నటించిన డెరిక్ అబ్రహాం ఆగష్టు 10వ తేదీన తెలుగు ఆహా ఓటీటీలో విడుదల కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి షాజీ పాడూర్ దర్శకత్వం వహించారు. గుడ్‍విల్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై టీఎల్ జార్జ్, జాబీ జార్జ్ నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసే కథతో దీనిని తెరకెక్కించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మమ్ముట్టి మెప్పించారు.
సుమారు రూ. 5కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 45 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యల కేసును ఏఎస్‍పీ డెరిక్ అబ్రహాం (మమ్ముట్టి) ఎలా పూర్తి చేశారనేది ప్రధానాంశంగా ఉంటుంది. ఆగష్టు 10వ తేదీన డెరిక్ అబ్రహాం చిత్రాన్ని ఆహా ఓటీటీలో చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment