ఓటీటీలో 'ఆహా' అనిపించే సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Malayalam Movie Aaha Telugu Version OTT Release Date Confirmed, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'ఆహా' అనిపించే సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Sep 10 2024 4:03 PM | Updated on Sep 10 2024 6:31 PM

Malayalam Movie Aaha Telugu OTT Streaming Locked

ఇతర భాషల్లో హిట్‌ అయిన సినిమాలను ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' తెలుగు వర్షన్‌లో తీసుకొస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా మలయాళ సూపర్‌ హిట్‌ స్పోర్ట్స్‌ డ్రామా సినిమా 'ఆహా' విడుదల కానుంది. 2021లో రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సుమారు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. బిబిన్ పాల్ శామ్యూల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కేరళలో బాగా పాపులర్‌ అయిన 'టగ్ ఆఫ్ వార్' గేమ్‌  గురించి ఈ సినిమా తెరకెక్కించారు.

'ఆహా' సినిమాలో ఇంద్రజిత్‌ సుకుమారన్‌ , మనోజ్‌ కె. జయన్‌, అమిత్‌ ప్రధాన పాత్రల్లో కనిపించారు. 'టగ్ ఆఫ్ వార్ కి రెడీగా ఉండండి.. ఆట మొదలెట్టాక అటో ఇటో తేలిపోవాల్సిందే' అంటూ స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. 1980, 1990ల్లో కేరళలో చాలా పాపులర్ అయిన 'టగ్ ఆఫ్ వార్' గేమ్‌లో పేరుగాంచిన  ఆహా నీలూర్ స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ టీమ్‌లోని యువకులు పగటి సమయంలో వేర్వేరు పనులు చేస్తూ జీవనం సాగించే వారు. రాత్రి సమయంలో తమ గ్రామానికి చేరుకుని టగ్‌ ఆఫ్‌ వార్‌ గేమ్‌ ఆడేవారు. ఫైనల్‌గా ఆ యువకులు ఏం సాధించారనేది ఈ 'ఆహా' సినిమా కథ. సెప్టెంబర్‌ 12న ఆహా ఓటీటీలో మీరూ చూసేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement