నెక్ట్స్‌ సీఎం? | Santhosh Pandit teams up with Mammootty | Sakshi
Sakshi News home page

నెక్ట్స్‌ సీఎం?

Dec 24 2017 1:08 AM | Updated on Dec 24 2017 8:26 AM

Santhosh Pandit teams up with Mammootty - Sakshi

ఆల్మోస్ట్‌ 26 ఇయర్స్‌ తర్వాత మలయాళ హీరో మమ్ముట్టి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి రంగం సిద్ధం అవుతోందని మాలీవుడ్‌ సమాచారం. మమ్ముట్టి ఏంటి? సీఎం ఏంటి? అనుకుంటున్నారా? మేం చెబుతున్నది ఆయన రీల్‌ లైఫ్‌ గురించి మాత్రమే. 1991లో కేరళ పొలిటీషియన్‌ జి. కార్తీ కేయన్‌ కథ ఆధారంగా బాలచంద్ర మీనన్‌ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ‘నాయాం వ్యక్తమక్కున్ను’.

ఆ సినిమాలో మమ్మట్టి ముఖ్యమంత్రి పాత్ర చేశారు. ఇప్పుడు సంతోష్‌ విశ్వనాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మమ్ముట్టి మళ్లీ ముఖ్యమంత్రిగా నటించబోతున్నారన్న వార్తలు మాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ‘నాయాం వ్యక్తమక్కున్ను’లో మమ్ముట్టి సీఎంగా కనిపించడం ఆయన అభిమానులను అలరించింది. సీఎంగా ఈ సూపర్‌ స్టార్‌ విజృంభించారు. మళ్లీ ఆ పాత్రలో ఆయన కనిపిస్తే అభిమానులకు పండగే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement