ఓటీటీలో క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌ సినిమా స్ట్రీమింగ్‌ | Malayalam Movie Thalavan OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌ సినిమా స్ట్రీమింగ్‌

Published Mon, Sep 9 2024 12:48 PM | Last Updated on Mon, Sep 9 2024 12:57 PM

Malayalam Movie Thalavan OTT Streaming Date Locked

మ‌ల‌యాళం థ్రిల్లర్‌ సినిమాలకు టాలీవుడ్‌లో భారీగానే అభిమానులు ఉన్నారు.  క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన త‌ల‌వాన్ సినిమా ఈ ఏడాది మే 24న విడుదలైంది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.

మలయాళంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న 'త‌ల‌వాన్' చిత్రానికి జిస్ జాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో  బిజు మీన‌న్, ఆసీఫ్ అలీ ప్రధాన పాత్రలలో న‌టించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 10న‌ ఓటీటీలో రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే, సోనీ లివ్‌ సంస్థ తాజాగా మరో ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ 9న సాయింత్రం నుంచే తలవాన్‌ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్లు సోనీ లివ్‌ వెళ్లడించింది. అయితే, ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది.

తలవాన్‌ చిత్రంలో  పోలీస్ ఆఫీస‌ర్లుగా బిజు మీన‌న్‌, ఆసిఫ్ అలీ అద్భుతమైన నటనతో మెప్పించారు.  మియా జార్జ్‌, అనుశ్రీ హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమాలో అనేక ట్విస్ట్‌లు ఉన్నాయి. అవన్నీ మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓ పోలీస్ ఆఫీస‌ర్‌కు నిజ జీవితంలో ఎదురైన య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో త‌ల‌వాన్ సీక్వెల్‌ను కూడా ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement