Sony channel
-
ఓటీటీలో క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
మలయాళం థ్రిల్లర్ సినిమాలకు టాలీవుడ్లో భారీగానే అభిమానులు ఉన్నారు. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తలవాన్ సినిమా ఈ ఏడాది మే 24న విడుదలైంది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న 'తలవాన్' చిత్రానికి జిస్ జాయ్ దర్శకత్వం వహించాడు. ఇందులో బిజు మీనన్, ఆసీఫ్ అలీ ప్రధాన పాత్రలలో నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ఓటీటీలో రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే, సోనీ లివ్ సంస్థ తాజాగా మరో ప్రకటన చేసింది. సెప్టెంబర్ 9న సాయింత్రం నుంచే తలవాన్ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నట్లు సోనీ లివ్ వెళ్లడించింది. అయితే, ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది.తలవాన్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్లుగా బిజు మీనన్, ఆసిఫ్ అలీ అద్భుతమైన నటనతో మెప్పించారు. మియా జార్జ్, అనుశ్రీ హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమాలో అనేక ట్విస్ట్‌లు ఉన్నాయి. అవన్నీ మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓ పోలీస్ ఆఫీసర్‌కు నిజ జీవితంలో ఎదురైన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో తలవాన్ సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. -
ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ ఏడాదిలో మలయాళ చిత్ర పరిశ్రమ చాలా హిట్ సినిమాలతో కళకళలాడిపోతోంది. ఈ ఏడాదిలో వచ్చిన చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. చాలా సినిమాలు అక్కడి ప్రేక్షకులతో పాటు.. ఇతర భాషల సినీ ప్రేమికులనూ అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేమలు,మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం,ఆవేశం,ఆడుజీవితం ,అన్వేషిప్పిమ్ కండెతుమ్ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇవన్నీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.అయితే తాజాగా మరో హిట్ సినిమా తెలుగులో విడుదల కానుంది. అది కూడా ఓటీటీలోకి రానుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన చిత్రం 'వర్షంగల్కు శేషం'. ఏప్రిల్ 11వ తేదీన రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ దక్కించుకుంది. సుమారు రెండేళ్ల క్రితం ప్రణవ్ మోహన్‌లాల్‌కు మొదటి హిట్ అందించిన డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ ఈ చిత్రం ద్వారా మరో విజయాన్ని అందుకున్నారు. జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ వేదికగా 'వర్షంగల్కు శేషం' స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు తెలుగు ట్రైలర్‌ను కూడా సోని లివ్ విడుదల చేసింది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో విడుదల అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 'వర్షంగల్కు శేషం' కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రధానంగా ఇద్దరు స్నేహితుల చుట్టూ జరిగే సంఘటనలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. వారిలో ఒకరు డైరెక్టర్ కావాలని ప్రయత్నిస్తే.. మరొకరు సంగీత దర్శకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా ఈ చిత్రం దగ్గరైంది. జూన్ 7 నుంచి సోనీ లివ్‌లో తెలుగులో అందుబాటులోకి రానున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. -
మనతో ఆట అంటే మజాకా.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..!
లీడ్స్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్.. వీక్షకుల(వ్యూయర్షిప్) పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత మూడేళ్లలో టీమిండియా ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్‌లలో అత్యధిక వ్యూయర్షిప్ ఈ సిరీస్‌కే వచ్చినట్లు సోనీ స్పోర్ట్స్ ఛానెల్ వెల్లడించింది. 2018 ఇంగ్లండ్ పర్యటనతో పోలిస్తే ఈ సిరీస్ సగటు వ్యూయర్షిప్ 30 శాతం పెరిగినట్లు సదరు సంస్థ ప్రకటించింది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ చివరి రోజు ఆటకు ఏకంగా 70 శాతం వరకూ రేటింగ్స్ పెరిగినట్లు పేర్కొంది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందన్న అంచనాతో ఆఖరి రోజు ఆటను భారీగా వీక్షించినట్లు తెలిపింది. ఈ మ్యాచ్ ఆఖరి రోజు సుమారు 80 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయని, భారత జట్టు విదేశాల్లో ఆడిన టెస్ట్ మ్యాచ్ ఒక రోజు వచ్చిన అత్యధిక ఇంప్రెషన్స్ ఇవేనని ఛానెల్ ప్రతినిధులు పేర్కొన్నారు. లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా గెలుపు తర్వాత తమ ఛానెల్‌కు మరిన్ని బ్రాండ్లు క్యూ కట్టాయని వారు తెలిపారు. కాగా, భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌కు ఇప్పటికే 12 అంతర్జాతీయ బ్రాండ్లు స్పాన్సర్లుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ నెల 4న ప్రారంభమైన ఈ సిరీస్‌లో ప్రస్తుతం మూడో టెస్ట్ జరుగుతుండగా, మరో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. చదవండి: ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా పక్షవాతం బారిన పడ్డ దిగ్గజ ఆల్‌రౌండర్ -
కథ పాతది... కిక్కు మాత్రం కొత్తది!
సోనీ చానెల్లో ప్రసారమయ్యే ‘మై న భూలూంగీ’ సీరియల్ కథ వింటే ‘గౌతమి’ అనే తెలుగు సినిమా గుర్తొస్తుంది. సుహాసిని ప్రధాన పాత్రలో నటించిన ఆ సిన్మాలో భర్త ఆమెను చంపాలనుకుంటాడు. ఆమె తప్పించుకుంటుంది. కానీ ముఖం కాలిపోతుంది. తర్వాత స్నేహితుడి సాయంతో అందంగా తయారై, వేషభాషలు మార్చుకుని వచ్చి పగ తీర్చుకుంటుంది. అచ్చు ఈ కథతో తీసిందే ‘మై న భూలూంగీ’. అయితే కథ పాతదే అయినా కథనంలో మాత్రం కొత్త కిక్కు ఉంది. రోజుకో కొత్త ట్విస్ట్‌తో ఉత్కంఠను రేకెత్తించే విధంగా సాగుతోంది. శిఖా తెలివైన అమ్మాయి. వ్యాపారవేత్త సమీర్‌తో ప్రేమలో పడుతుంది. వారి వివాహం జరుగుతుంది. బాబు పుడతాడు. అయితే సమీర్ నిజ స్వరూపం... అతడు తనను చంపాలని ప్రయత్నించిన తర్వాత గానీ తెలియదు శిఖాకి. అతడి అసలు పేరు ఆదిత్య జగన్నాథ్ అని, తనను ఓ పథకం ప్రకారం పెళ్లాడాడని తెలుసుకుంటుంది. హత్యా ప్రయత్నంతో వికారంగా తయారైన తన ముఖాన్ని అందంగా మార్చుకుని, ఓ కొత్త రూపంలో అతడి ముందుకొస్తుంది. సమైరాగా పేరు మార్చుకుని, మోడల్‌గా పరిచయం చేసుకుంటుంది. అతడి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి అతడికి దగ్గరవుతుంది. అతడితో ఆడుకుంటోంది. ఈ సీరియల్‌కి ప్రధాన ఆకర్షణ... ఐశ్వర్యా సకూజా. అమాయకురాలైన ‘శిఖా’గా, మైండ్‌గేమ్ ఆడే ‘సమైరా’గా ఆమె నటనకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి. గతంలో ‘సాస్ బినా ససురాల్’తో మంచి మార్కులు కొట్టేసిన ఆమె... ఇప్పుడీ సీరియల్‌తో టెలివిజన్ ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతస్థానం సంపాదించింది. ఆదిత్యగా వికాస్, సమైరా స్నేహితుడు నీరజ్‌గా అవినేష్ రేఖీల నటన కూడా ప్రశంసనీయమైనది. మరి ముందు ముందు కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే!