
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 55 ఏళ్లు. కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీకి సంబంధించిన చికిత్స తీసుకుంటూ సోమవారం చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా 19వ దశాబ్దంలో మలయాళ చిత్రసీమలో ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మంచిపేరు సంపాదించారు. రిజబావా మృతిపట్ల నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, అక్షయ ప్రేమ్‌నాథ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
1990లో షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన డాక్టర్ పశుపతి అనే చిత్రంలో రిజాబావా తొలిసారిగా నటించారు. అదే ఏడాది వచ్చిన కామెడీ థ్రిల్లర్ ‘ఇన్ హరిహర్ నగర్’లో జాన్ హొనై పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ నుండి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాదాపు 150 చిత్రాలలో నటించిన రిజబావా పలు టీవీ సీరియల్స్ లోనూ చేశారు. చివరగా ఆయన మమ్ముట్టి నటించిన ‘వన్’ చిత్రంలో నటించారు.
చదవండి: ఫ్యాషన్ డిజైనర్‌తో ‘తుపాకీ’ విలన్ ఎంగేజ్‌మెంట్, ఫొటోలు
పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రిజబాబా కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల్లో నటించడం లేదు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment