SSMB29: మహేశ్‌- రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌! | SSMB29: Interesting Update On Rajamouli-Mahesh Babu Movie | Sakshi
Sakshi News home page

SSMB29: మహేశ్‌- రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌!

Published Thu, Jul 4 2024 11:29 AM | Last Updated on Thu, Jul 4 2024 11:43 AM

SSMB29: Interesting Update On Rajamouli-Mahesh Babu Movie

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను శరవేగంగా చేస్తున్నారు రాజమౌళి. సెప్టెంబరులో ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లాలన్నది రాజమౌళి ముందున్న ప్రస్తుత టార్గెట్‌ అట. 

ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి చెందిన సెట్‌ వర్క్‌ను ఆరంభించారని తెలిసింది. జస్ట్‌ ఒక్క సెట్‌ కాదు... పలు రకాల సెట్స్‌ను డిజైన్‌ చేయిస్తున్నారట రాజమౌళి. వీటిలో ఆఫీస్‌ సెట్‌ కూడా ఉందని, ఎక్కువ శాతం షూటింగ్‌ ఈ సెట్‌లో జరుగుతుందని భోగట్టా. ప్రస్తుతం తయారు చేయిస్తున్న సెట్స్‌లో ఏదో ఒక సెట్‌లో తొలి షెడ్యూల్‌ని ఆరంభిస్తారట. 

ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని విలన్‌ పాత్రకు మలయాళ నటుడు– దర్శక–నిర్మాత పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను తీసుకున్నారనే టాక్‌ ప్రచారంలోకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement