
ఈ మధ్య కాలంలో మూవీ ప్రమోషన్ చేసే విధానం మారిపోయింది. ఇంతకుముందు తమ సినిమాని టీవీలు, పత్రికలకి ఇంటర్వూలు ఇవ్వడం..
ఈ మధ్య కాలంలో మూవీ ప్రమోషన్ చేసే విధానం మారిపోయింది. ఇంతకుముందు తమ సినిమాని టీవీలు, పత్రికలకి ఇంటర్వూలు ఇవ్వడం ద్వారా సినిమా ప్రచారం చేసుకునేవారు. ఇంటర్న్‌నెట్ వాడకం పెరిగిన ఈ తరుణంలో సోషల్ మీడియాలో వినూత్నంగా మూవీ ప్రమోషన్లు చేస్తున్నారు.
తాజాగా అలాంటి ప్రచారమే చేశారు మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటించిన కొత్త చిత్రం ‘భ్రమమ్’. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’కి రిమేక్‌గా వస్తున్న ఈ చిత్రం గురువారం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదల అవుతోంది.
ఈ నేపథ్యంలో ఆ సినిమాను ట్విట్టర్‌లో ప్రమోట్ చేశాడు హీరో దుల్కర్ సల్మాన్. దానిలో భాగంగా అక్టోబర్ 6న ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో దుల్కర్, పృథ్వీరాజ్‌కి ఫోన్ చేసి ‘నాకు సీఐడీ రామదాస్ ఎందుకు ఫోన్ చేశారు? ఆయనకు ఏం కావాలి? నా నెంబర్ నువ్వే ఇచ్చావా?’ అని అడగగా.. నిజం తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అది సీక్రెట్’ అంటూ మరో హీరో బదులిచ్చాడు.
రాశీఖన్నా హీరోయిన్‌గా చేస్తున్న ‘భ్రమమ్’లో మమతామోహన్‌దాస్ కీలకపాత్రలో నటించనుంది. అయితే దుల్కర్ సల్మాన్, కీర్తీ సురేశ్ లీడ్‌రోల్ చేసిన ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు.
చదవండి: దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా హను-మాన్ ఫస్ట్‌లుక్
What did CID Ramadas want from me @PrithviOfficial and did you give him my number? pic.twitter.com/5Xs2EAUOlP
— dulquer salmaan (@dulQuer) October 6, 2021