
అమలా పాల్, ఏఆర్ రెహమాన్
...అంటున్నారు అమలా పాల్. మలయాళ చిత్రం ‘ఆడు జీవితం’లో హీరోయిన్‌గా ఎంపిక అవ్వడం పట్ల ఈ మాలీవుడ్ బ్యూటీ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘డైరెక్టర్ బ్లెసీ ‘ఆడు జీవితం’ లో సైనూ పాత్రలో కనిపించనున్నాను. ఈ విజువల్ వండర్‌లో ఫృథ్వీరాజ్, లెజెండ్ ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టీ వంటి మాస్టర్స్‌తో కలిసి పని చేస్తున్నందుకు ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ హానర్డ్. కచ్చితంగా ప్రపంచ సినిమా పై ఓ మార్క్ చూపిస్తుంది’’ అని పేర్కొన్నారు అమలా పాల్. ఆమె ఇంతలా ఎగై్జట్ అవ్వడానికి కారణం ఏంటీ అంటే ఈ సినిమాలోని విశేషాలే.
ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి మిస్ అయిన నజీబ్ మొహమద్ అనే వ్యక్తి లైఫ్ ఇన్సిడెంట్స్‌తో బైన్యామిన్ రాసిన ఫేమస్ మలయాళీ నవల ‘ఆడు జీవితం’ ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు బ్లెస్సీ. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మాలీవుడ్ సినిమాకు సంగీతం సమకూర్చనున్నారు. 1992లో వచ్చిన మోహన్‌లాల్ ‘యోధ’నే ఏఆర్ రెహమాన్ ఫస్ట్ అండ్ లాస్ట్ మలయాళ సినిమా. ‘ఆడు జీవితంలో’ హీరోగా, నజీబ్ మొహమద్ పాత్రలో నటిస్తున్న ఫృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 2 ఇయర్స్ డేట్స్ ఇచ్చేశారట. ఈ మెగా బడ్జెట్ సినిమాను 3డీలో రూపొందిస్తున్నారు.