Prithviraj Sukumaran's Injury Delays Prabhas Salaar Movie Also - Sakshi
Sakshi News home page

Salaar Movie: ఎన్ని కష్టాలు బ్రో.. సడన్‌గా అలా జరిగేసరికి!

Published Wed, Jun 28 2023 1:05 PM | Last Updated on Wed, Jun 28 2023 1:38 PM

Prithviraj Sukumaran Injury Salaar Movie Delay - Sakshi

'ఆదిపురుష్' రిజల్ట్ ప్రభాస్ అభిమానులని చాలా నిరాశపరిచింది. కలెక్షన్స్ తగ్గిపోవడం, లెక్కలేనన్ని వివాదాలు.. వాళ్లకు చిరాకు తెప్పిస్తున్నాయి. దీంతో ఈ సినిమా గురించి మర్చిపోవాలని ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో 'సలార్' కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ మూవీతో ప్రభాస్ హిట్ కొట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు. అప్పుడే విమర్శకుల నోళ్లు మూతబడతాయనేది వాళ్ల ఆశ. అయితే ఇప్పట్లో అది జరిగేలా కనిపించట్లేదు!

'సలార్' కోసం వెయిటింగ్!
ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది మాస్ సినిమాలే. లేదంటే వేరే లెవల్ ఎలివేషన్స్ ఇచ్చే చిత్రాలు. 'బాహుబలి'తో డార్లింగ్ హీరో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీని తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చేశాడు. కానీ అభిమానుల్ని పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేకపోయాడు. దీంతో వాళ్లందరూ 'సలార్'పై బోలెడన్ని ఆశలు పెట‍్టుకున్నారు.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్)

విలన్‌కి ప్రమాదం
'సలార్'లో జగపతిబాబు, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్ గా నటిస్తున్నారు. సరిగ్గా మూడు రోజుల క్రితం పృథ్వీరాజ్‌కి ఓ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించి, సర్జరీ చేశారు. కొన్నివారాలపాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఇలా సడన్ గా యాక్సిడెంట్ జరగడం.. 'సలార్' చిత్రబృందానికి షాక్‌ ఇచ్చింది.

షూట్ బ్యాలెన్స్
ఎందుకంటే 'సలార్‍'లో పృథ్వీరాజ్ రోల్ కి సంబంధించి కాస్త షూట్ మిగిలుంది. త్వరలో ఇది పూర్తి చేయాలనుకున్నారు. ఇప్పుడేమో అతడికి ప్రమాదం జరిగి, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. త్వరలో కోలుకుని సెట్ లో అడుగుపెడితే పర్లేదు. ఇదంతా త‍్వరగా జరిగితేనే ఆల్రెడీ ప్రకటించినట్లు సెప్టెంబరు 28న 'సలార్' థియేటర్లలోకి వస్తుంది. కుదరకపోతే మాత్రం వాయిదా గ్యారంటీ. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.


(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement