
బాహుబలి భారీ విజయం తర్వాత ప్రభాస్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఆయన సూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘సలార్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల కాలంలో ఎంతోమంది వివిధ భాషల్లో స్టార్ హీరోలుగా ఫేమ్ ఉన్నవారు సైతం ఇతరుల సినిమాల్లో విలన్‌గా నటించడానికి సై అంటున్నారు. సంజయ్ దత్ ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, మలయాళీ స్టార్ ఫహాద్ ఫాజిల్ ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తున్నారు. ఈ తరుణంలో ‘సలార్’ మూవీలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దీంతో టాలీవుడ్, మాలీవుడ్‌ల్లో స్టార్స్‌గా వెలుగొందుతున్న వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఇద్దరి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇదేగనక నిజమైతే ఈ పాన్ ఇండియా మూవీ ఇంక బజ్ రావడం ఖాయం. చూద్దాం ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో..
Comments
Please login to add a commentAdd a comment