పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ఆడుజీవితం. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్‌గా నటించిది. ఈ సినిమా ది గోట్ లైఫ్ అనే పేరుతో ఇంగ్లీష్‌లోనూ విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన పృథ్వీరాజ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. 'ఇందులో నేను నజీబ్ అనే బానిస పాత్రలో నటించా. దాని కోసమే 31 కిలోలు బరువు తగ్గా. జిమ్ ట్రైనర్, పోషకాహార నిపుణులు, డాక్టర్స్ పర్యవేక్షణలో ఇదంతా చేశా. వారంతా విశ్రాంతి తీసుకోమని నాకు సలహాలు ఇచ్చేవారు. కొన్ని సందర్భాల్లో 72 గంటలు షూటింగ్‌లోనే ఉండాల్సి వచ్చేది. కరోనా లాక్‌డౌన్‌తో చిత్రబృందం చాలా ఇబ్బందులు పడింది. పశ్చిమాసియాలోని జోర్డాన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. వీటిని మీతో పంచుకునేందుకు ఇదే సరైన సమయమని భావించా. అందుకే చెప్పాను' అని అన్నారు. కాగా.. ప్రభాస్ నటించిన సలార్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment