live music consert
-
క్రిస్మస్ వేడుకల్లో అలరించిన లైవ్ మ్యూజిక్ బ్యాండ్ (ఫొటోలు)
-
స్వరరాగ గంగా ప్రవాహం
నవంబర్ 11న హైదరాబాద్లో స్వరరాగ గంగా ప్రవాహం జరగనుంది. ప్రముఖ గాయకులు కె.జె. ఏసుదాస్ లైవ్లో పాడనున్నారు. ఐదు దశాబ్దాలుగా అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది చిత్రాల్లో తన మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వర సాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు ఏసుదాస్. తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్ 11న హైదరాబాద్లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్నారు. గతంలో మేస్ట్రో ఇళయరాజాతో, హీరోయిన్, భరత నాట్యం కళాకారిణి శోభనతో ప్రోగ్రామ్స్ నిర్వహించిన ‘11.2’ సంస్థ ఏసుదాస్ ప్రోగ్రామ్ని నిర్వహించనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఏసుదాస్ లైవ్ కన్సర్ట్ జరగలేదు. తొలిసారి జరగనున్న ఈ కార్యక్రమం పోస్టర్ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.టి.ఆర్ విడుదల చేశారు. -
హైదరాబాద్లో ఫస్ట్ టైమ్!
ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘స్వరజ్ఞాని’ ఇళయరాజా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరుగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన మొట్ట మెదటిసారిగా ఇస్తున్న లైవ్ కన్సర్ట్ ఇది. ఈ ఈవెంట్ విశేషాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇళయరాజా పాల్గొన్నారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో కలిసి ఈవెంట్ టికెట్స్ను లాంచ్ చేశారాయన. టెంపుల్ బెల్ ఈవెంట్స్ అండ్ మీడియా మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ– ‘‘నేను ఇంతవరకు హైదరాబాద్లో పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ౖ టెమ్ పర్ఫార్మ్ చేయడానికి ఆసక్తికరంగా ఎదరుచూస్తున్నాను’’ అన్నారు. ‘‘ఇళయరాజాగారి కంపోజిషన్స్కి బిగ్ ఫ్యాన్స్ మేము. హైదరాబాద్లో ఆయన పర్ఫార్మెన్స్ చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఇక్కడ ఇళయరాజాగారి ఫస్ట్ మ్యూజిక్ కన్సర్ట్ను కండక్ట్ చేసే అవకాశం మాకు వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాం. సంగీతప్రియులకు ఈ ఈవెంట్ ఒక గ్రేట్ ట్రీట్’’అని టెంపుల్బెల్ ఈవెంట్స్ ఛీప్ మార్కెటింగ్ ఆఫీసర్ జి. సందీప్ తెలిపారు. ఈ ఈవెంట్లో 80 మంది మ్యూజిషియన్స్తో ఆర్కెస్ట్రా ఉంటుంది. -
అటు చావులూ.. ఇటు సంగీతమా?
ముంబై: కళలు, క్రీడలపై తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిచజూసే శివసేన పార్టీ మరో వివాదానికి తెరలేపింది. ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకుడు, పాకిస్థానీ అయిన ఉస్తాద్ గులామ్ అలీ.. ముంబైలో నిర్వహించనున్న సంగీతకచేరీని అడ్డుకుంటామంటూ శివసేన కార్యకర్తలు బుధవారం ఆందోళనలు నిర్వహించారు. 'ఓవైపు సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం భారతీయులను కాల్చిచంపుతుంటే.. ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమిటి?' అంటూ నినాదాలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ ' పాకిస్థాన్ తో క్రీడలైనా, సాంస్కృతి అంశమైనా, దౌత్యపరమైన చర్చలైనా ప్రతిదానినీ మేం వ్యతిరేకిస్తం. ఆ దేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేంతవరకు మా వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదు' అన్నారు. ఈ మేరకు కచేరీ జరగనున్న షణ్ముఖానంద్ హాల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం సాయంత్రం గులామ్ అలీ కచేరి ప్రారంభం కావాల్సిఉంది. అయితే శివసేన బెదిరింపులపై ఫడ్నవిస్ సర్కార్ ఇప్పటివరకు పెదవివిప్పలేదు. దీంతో గులామ్ అలీ కచేరీ నిరాటంకంగా జరుగుతుందా? లేదా అనే విషయంపై ఆయన అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.