అదిరే అధీరా | KGF Chapter 2 new poster out on Sanjay Dutt | Sakshi
Sakshi News home page

అదిరే అధీరా

Published Thu, Jul 30 2020 5:19 AM | Last Updated on Thu, Jul 30 2020 5:19 AM

KGF Chapter 2 new poster out on Sanjay Dutt - Sakshi

తెల్లటిగడ్డం, మెలితిరిగిన మీసాలు, ముఖంపై పచ్చబొట్టు, చేతిలో కత్తితో సంజయ్‌ దత్‌ కొత్త లుక్‌లో అభిమానులను ఆనందపరిచారు. సూపర్‌ హిట్‌ మూవీ ‘కె.జి.ఎఫ్‌’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘కె.జి.ఎఫ్‌ చాప్టర్‌–2’లో ఆయన విలన్‌ అధీరా పాత్రను పోషిస్తున్నారు. బుధవారం సంజయ్‌ దత్‌ పుట్టినరోజు (జూలై 29) సందర్భంగా అధీరా పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

‘లుక్‌ అదిరే’ అనే ప్రశంసలు లభించాయి. యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘హ్యాపీ బర్త్‌డే టు సంజూ బాబా. మా చిత్రంలో భాగమైనందుకు ఆయనకు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేశారు ప్రశాంత్‌. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రం ద్వారా నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన్‌ గౌడ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement