
శశాంక్ మంగు, భవ్యశ్రీ జంటగా సూర్యకుమార్ భగవాన్ దాస్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విధి లిఖితం’. ఎమ్. లోచన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై పాండు నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ– ‘‘సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. వైవిధ్యమైన కథాంశంతో ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో రెగ్యులర్ చిత్రాలు తీస్తే చూసే పరిస్థితి లేదు. ఒక కొత్త పాయింట్‌తో సినిమా తీయకపోతే పోటీలో నిలవడం కష్టంగా ఉంది. లోచన్ చెప్పిన కథ చాలా కొత్తగా, థ్రిల్లింగ్‌గా ఉంది. వికాశ్ కురుమెళ్ల మంచి సంగీతం అందిస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస్ కంతేటి, రామకృష్ణ పరిటాల చక్కని మాటలు అందించారు. మా సినిమా మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన రావటంతో యూనిట్ అంతా ఉత్సాహంగా ఉన్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాగేంద్ర కుమార్ మోతుకూరి.