నితిన్ ప్రసన్న
‘‘థ్రిల్లర్ జానర్‌లో ఓ తెలుగు సినిమా వస్తుందనగానే ఏదో ఒక అంతర్జాతీయ సినిమా నుంచి స్ఫూర్తి పొంది తీస్తున్నారేమో అనుకుంటారు. కానీ, మా ‘ఎ’ సినిమా ఇప్పటివరకు ఏ భాషలో రానటువంటి సరికొత్త కథాంశంతో తెరకెక్కిన అసలు సిసలైన థ్రిల్లర్’’ అని దర్శకుడు యుగంధర్ ముని అన్నారు. నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని, స్నేహల్ కమత్, బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజŒ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎ’. అవంతిక ప్రొడక్ష¯Œ ్స పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా యుగంధర్ ముని మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలోని సన్నివేశాల చిత్రీకరణకు దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారిని ఆదర్శంగా తీసుకున్నాను. వీఎఫ్‌ఎక్స్‌లను తగ్గించి పాత కెమెరా ట్రిక్‌లను వాడాం. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌కు స్టోరీబోర్డ్ గీయించాం. నితిన్ ప్రసన్న మొదటి సినిమాలోనే 3 పాత్రల్లో నటించారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment