పోస్టర్ ఆవిష్కరించిన సంతోష్‌కుమార్‌తో మహావీర్, నీలిమ
శ్రీరాం హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘అసలేం జరిగింది?’. ఎన్‌వీఆర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను నీలిమ నిర్మించనున్నారు. శనివారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేసిన ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణలో ఇంతవరకు ఎవరూ తీయని లొకేషన్స్‌లో యూనిట్ ఈ సినిమాను చిత్రీకరించాలనుకోవడం అభినందనీయం. లొకేషన్స్ అన్వేషణ కోసం టీమ్ 6 నెలల పాటు కష్టపడ్డారు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న కెమెరామేన్ ఎన్‌వీఆర్‌కు శుభాకాంక్షలు.
ఈ చిత్రం విజయవంతమై, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘వచ్చే నెల 11న షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నాం. రామ్‌గోపాల్‌వర్మ ‘భైరవగీత’ చిత్రంలో విలన్‌గా నటించిన విజయ్ రామ్ ఈ సినిమాలో కూడా విలన్‌గా నటిస్తారు. మహావీర్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రానికి నెర్రపల్లి వాసు కథ అందించారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే కథ ఇది’’ అన్నారు నిర్మాత.
Comments
Please login to add a commentAdd a comment