మోదీ మనోవిరాగి | Narendra Modi Biopic Manoviragi Poster Released | Sakshi
Sakshi News home page

మోదీ మనోవిరాగి

Published Fri, Sep 18 2020 2:12 AM | Last Updated on Fri, Sep 18 2020 2:12 AM

Narendra Modi Biopic Manoviragi Poster Released - Sakshi

అభయ్‌వర్మ

ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘మోదీ’. తెలుగులో ఈ సినిమా ‘మనోవిరాగి’గా, తమిళంలో ‘కర్మయోగి’గా విడుదల కానుంది. ఎస్‌. సంజయ్‌ త్రిపాఠి రచించి, దర్శకత్వం వహించారు. మహావీర్‌ జైన్‌తో కలిసి దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేత యం. సుభాస్కరన్‌ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

గురువారం మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమా పోస్టర్లను విడుదల చేశారు. మోదీ పాత్రలో అభయ్‌వర్మ నటించారు. మోదీ  పెరిగిన గుజరాత్‌లోని వాద్‌నగర్, ఉత్తరాఖండ్‌లలో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా యం. సుభాస్కరన్‌ మాట్లాడుతూ– ‘‘ప్రధాని మోదీగారి టీనేజ్‌ విశేషాలు, ఆయన జీవితంలోని ముఖ్యమైన మలుపుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సమర్పించటం సంతోషంగాను, మాకు దక్కిన గౌరవంగాను భావిస్తున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement