
స్టెఫీ పటేల్, వంశీ యాకశిరి
వంశీ యాకశిరి, స్టెఫీ పటేల్ జంటగా రూపొందిన చిత్రం ‘నిన్ను తలచి’. ఎస్‌ఎల్‌యన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ పతాకాలపై ఓబులేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్ నిర్మించారు. అనిల్ తోట దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లేటేస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘త్వరలోనే వీడియో సాంగ్స్, ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రనిర్మాతలు తెలిపారు.
అనిల్ తోట మాట్లాడుతూ– ‘‘అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న టైమ్‌లో చిత్రాన్ని పూర్తి చేశాం. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న వంశీ కొత్త హీరోలా అనిపించడు. అతని నటన సినిమాకు ప్లస్ అవుతుంది’’ అన్నారు. వంశీ మాట్లాడుతూ– ‘‘ఓ ఫీల్‌గుడ్ మూవీతో హీరోగా పరిచయమవ్వటం ఆనందంగా ఉంది. నిర్మాతలు అన్ని సౌకర్యాలు కల్పిస్తే దర్శకుడు అనిల్ తోట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించారు’ అన్నారు.