
‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ స్టోరి’. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని ఈ నెల 10న ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించి, తాజా పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
‘‘ప్లెజంట్ ప్రేమకథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల రూపొందించిన మరో ఆహ్లాదకరమైన చిత్రం ‘లవ్ స్టోరి’. ఈ అందమైన ప్రేమకథపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ‘ఏయ్ పిల్లా..’ పాటకి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్, సంగీతం: పవన్ సి.హెచ్, సహనిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వర రావు.
Comments
Please login to add a commentAdd a comment