
శరణ్‌కుమార్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘సాక్షి’. జాన్వీర్ కౌర్ హీరోయిన్. శివకేశన కుర్తి దర్శకత్వంలో ఆర్‌యూ రెడ్డి, బేబీ లాలిత్య సమర్పణలో మునగాల సుధాకర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 21న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– 'విజయనిర్మలగారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, శరణ్‌తోపాటు చిత్ర యూనిట్‌కి మంచి పేరు రావాలి' అన్నారు. 'సాక్షి’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది' అన్నారు శరణ్. 'యూనిట్ సభ్యులందరూ బాగా సహకరించారు' అన్నారు శివ. 'ప్రేక్షకులు మా చిత్రాన్ని విజయవంతం చేయాలి' అన్నారు సుధాకర్‌రెడ్డి, ఆర్‌యూ రెడ్డి.