విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా ‘వీఎస్ 11’(వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
దివంగత నటుడు ఎన్‌టీఆర్ 100వ జయంతి సందర్భంగా ‘వీఎస్ 11’ నుంచి విశ్వక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘నైతికత లేని సమాజంలో ఓ గ్రే మ్యాన్ ప్రయాణాన్ని వర్ణించే చిత్రం ఇది. చీకటి, క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి కథను ఈ సినిమా వివరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment