'నాన్నకు ప్రేమతో..' కొత్త పోస్టర్ రిలీజ్
Published Wed, Dec 9 2015 4:05 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM
సరికొత్త లుక్‌తో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో..' సినిమాకు సంబంధించి మరో పోస్టర్ రిలీజ్ అయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో సందడి చేసిన ఎన్టీఆర్.. మరో పోస్టర్ తో అలరించాడు. సుకుమార్ దర్శకత్వంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంకాంత్రికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ పై యూనిట్ దృష్టి పెట్టింది. అందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, స్టిల్స్, టీజర్స్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ కనిపించనంత స్టైలిష్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించనుండడంతో అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నెగెటివ్ రోల్లో అలరించనున్నాడు.
Advertisement
Advertisement