మూడు రోజుల్లో ముప్పై కోట్లు | 'Nannaku Prematho' rakes in over Rs.30 crore in three days | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో ముప్పై కోట్లు

Published Sat, Jan 16 2016 1:28 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

మూడు రోజుల్లో ముప్పై కోట్లు - Sakshi

మూడు రోజుల్లో ముప్పై కోట్లు

ఇటీవల ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి బరిలో భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందరి కంటే ముందు జనవరి 13న రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కలెక్షన్ల పరంగా ఎన్టీఆర్ కెరీర్లోనే సరికొత్త రికార్డ్లను సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే 12 కోట్ల వసూళ్లతో ఆకట్టుకుంది. రిలీజ్ తరువాత డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం నాన్నకు ప్రేమతో దూసుకుపోతోంది.

తొలి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల వసూళ్లను రాబట్టింది నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ స్థాయిలో 1700 థియేటర్లకు పైగా రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో తొలి వారంలో 50 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈసినిమాలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement