సొంత గొంతు వినిపిస్తుందట..! | rakul preeth singh own dubbing for nannaku prematho | Sakshi
Sakshi News home page

సొంత గొంతు వినిపిస్తుందట..!

Published Tue, Nov 24 2015 12:41 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

సొంత గొంతు వినిపిస్తుందట..! - Sakshi

సొంత గొంతు వినిపిస్తుందట..!

ప్రజెంట్ టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు కూడా చేయలేని ఓ సాహసం, ఈ అమ్మడు కెరీర్ స్టార్టింగ్లోనే చేసేస్తోంది. తెలుగులో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఈ పంజాబీ భామ తన నెక్ట్స్ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనుందట. ప్రస్తుతం ఎన్టీఆర్, సుకుమార్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' లో నటిస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమాలో తన సొంత గొంతును వినిపించడానికి రెడీ అవుతోంది.

ఇప్పటికే సినిమా ఫంక్షన్స్లో, ప్రెస్మీట్స్లో తెలుగులో గలగలా మాట్లాడేస్తున్న రకుల్ డబ్బింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా పదాలు సరిగ్గా పలకటం కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటుంది. అయితే ఈ సినిమాలో... లండన్లో నివసించే తెలుగు అమ్మాయి పాత్రలో నటిస్తుంది కాబట్టి, తెలుగు ఉచ్ఛారణ కాస్త అటుఇటుగా ఉన్నా ఫరవాలేదనే ఉద్దేశంతో.. చిత్ర యూనిట్ రకుల్ సొంతం గొంతుకు ఓటు వేశారు. మరి ఇన్నాళ్లు అరువు గొంతుల మీద ఆధారపడ్డ ఈ భామ, సొంత గొంతుతో ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement