
Hero Sudheer Babu Announces His Next Movie: హీరో సుధీర్‌బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్‌బాబు ప్రస్తుతం కృతిశెట్టితో కలసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. తాజాగా తన 16వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకున్నాడు.
మహేష్ సురపనేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘గన్స్ డోంట్ లై’ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ తుపాకులు, పోలీస్ స్పెషల్ క్రైమ్స్ డివిజన్ అనే లోగోతో ఇంట్రెస్టింగ్‌గా పోస్టర్‌ను వదిలారు. ఈ సినిమాలో హీరోయిన్ సహా మరింత సమాచారం త్వరలోనే తెలియనుంది.
Super excited for this one 😊#Sudheer16 Action Unlimited👊🏻@bharathhere @actorsrikanth @imaheshh @vincentcinema @bhavyacreations #anandaprasad @anneravi pic.twitter.com/NZix4covyc
— Sudheer Babu (@isudheerbabu) February 12, 2022