‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ చిత్రంతోపాటు విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ‘వీడీ 13’ (వర్కింగ్ టైటిల్) సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. కాగా ఆగస్టు 1న మృణాళ్ ఠాకూర్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ‘హాయ్ నాన్న’ టీమ్ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఈవీవీ సతీష్.
సెట్స్‌లో... ‘గీత గోవిందం’ వంటి హిట్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీడీ 13’ (వర్కింగ్ టైటిల్). ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లో మృణాల్ బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్‌లో విజయ్ దేవరకొండ, పరశురామ్, శిరీష్, హన్షితపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment