రానాతో సాయిపల్లవి కోలు.. కోలు... | Virata Parvam Makers to release the lyrical video of Kolu Kolu on Feb 25 | Sakshi
Sakshi News home page

రానాతో సాయిపల్లవి కోలు.. కోలు...

Published Tue, Feb 23 2021 1:23 AM | Last Updated on Tue, Feb 23 2021 10:29 AM

Virata Parvam Makers to release the lyrical video of Kolu Kolu on Feb 25 - Sakshi

‘కోలు కోలు..’ అంటూ సాయిపల్లవి హుషారుగా స్టెప్పేశారు. రానా సరసన నటిస్తున్న ‘విరాటపర్వం’లో సాయిపల్లవిపై తీసిన సోలో సాంగ్‌ ఇది. వేణు ఊడుగుల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కోలు కోలు..’ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ ఈ నెల 25న రిలీజ్‌ కానుంది. ఈ పాటకు సంబంధించిన సాయిపల్లవి పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘‘ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను  రానా, సాయిపల్లవి చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్‌  చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: డానీ సాంచెజ్‌ లోపెజ్, దివాకర్‌ మణి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూ సర్‌: విజయ్‌కుమార్‌ చాగంటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement