Rana Daggubati Counter To Netizen Who Satires On Virata Parvam Poster - Sakshi
Sakshi News home page

Rana Daggubati: ఛీ, దరిద్రమంటూ నెటిజన్‌ ఓవరాక్షన్‌, కౌంటరిచ్చిన రానా

Published Sun, Jun 5 2022 5:03 PM | Last Updated on Sun, Jun 5 2022 6:05 PM

Rana Daggubati Counter To Netizen Who Satires On Virata Parvam Poster - Sakshi

రానా దగ్గుబాటి విరాటపర్వం సినిమా కూడా ప్రమోషన్స్‌ స్పీడు పెంచింది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్‌తో పాటు వీడియో కూడా రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే కదా! అయితే ఆ పోస్టర్‌లో కేవలం సాయిపల్లవి మాత్రమే కనిపించేలా రానా ఫొటోను కనబడకుండా కట్‌ చేశారు. దీనిపై ఓ నెటిజన్‌ అసహనం వ్యక్తం చేశాడు. 'ఛీ, దరిద్రం.. సొంత బ్యానర్‌లోనే ఫేస్‌ కట్‌ చేశారు. ఇంకా బయట వాళ్లు వేలెత్తి చూపించడంలో తప్పేముందిలే. ఆ సినిమాలో, ఈ సినిమాలో తక్కువ నిడివి ఉండే పాత్రలు చేయడం, అందరికీ లోకువ అయిపోవడం రానా స్టైల్‌' అని కామెంట్‌ చేశాడు. దీనికి హీరో స్పందిస్తూ 'మనం తగ్గి కథని హీరోయిన్‌ను ఎలివేట్‌ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్‌.. సొంత బ్యానర్‌ కదా, గొప్ప పనులు ఇక్కడే చేయొచ్చు' అని కౌంటరిచ్చాడు. అతడి తిక్క భలే కుదిర్చాడు అంటూ అభిమానులు రానాను ప్రశంసిస్తున్నారు.

ఇక సాయిపల్లవి కోసమే సినిమా తీశాంరా బాబూ అని ప్రమోషన్‌ వీడియోలో చెప్పాడు రానా. దీనిపై హీరోయిన్‌ అభిమాని ఒకరు స్పందిస్తూ 'తెలుగు ఇండస్ట్రీ ఇంత ప్రోగ్రెసివ్‌ మాటలని తట్టుకోలేదు. మీరు మలయాళంలోనో, తమిళ ఇండస్ట్రీలోనో ఉండాల్సింది. అప్పుడు మీకు మరింత గుర్తింపు వచ్చి ఉండేది' అని ట్వీట్‌ చేసింది. దీనికి రానా రిప్లై ఇస్తూ.. 'తెలుగు ఇండస్ట్రీ అంత ప్రోగ్రెసివ్‌ ప్లేస్‌ ఏది లేదు బంగారం. ఇండియా అంతా చూసి వచ్చాను. మాకు హీరో లవ్‌ కొంచెం ఎక్కువ అంతే' అని స్వీట్‌గా బదులిచ్చాడు. ఇదిలా ఉంటే విరాటపర్వం సినిమా ట్రైలర్‌ ఆదివారం సాయంత్రం 6 గంటలకు రిలీజ్‌ కానుంది.

చదవండి: సాయిపల్లవి కోసమే సినిమా తీశాం, నేనూ ఆమె అభిమానినే
చై కోసం స్టార్‌ హీరో సినిమాకు నో చెప్పిన సమంత!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement